Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పీఏపై ఈడీ దాడుల తర్వాత కాంగ్రెస్ పదవులకు రాజీనామా

పీఏపై ఈడీ దాడుల తర్వాత కాంగ్రెస్ పదవులకు రాజీనామా

వార్త 3 weeks ago

Harish Rawat: ఉత్తరాఖండ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్‌కు చెందిన పీఏ చందన్ సింగ్ జీనా నివాసాలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

గురువారం జరిగిన ఈ తనిఖీల్లో రూ.32 లక్షల నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలు, నాణేలు, ఖరీదైన లగ్జరీ వాచ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. జీనా గతంలో హరీశ్ రావత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓఎస్‌డీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయనకు పీఏగా కొనసాగుతున్నారు. ఈడీ దర్యాప్తులో భాగంగా డెహ్రాడూన్‌లోని పలు ప్రాంతాల్లోనూ సోదాలు జరిగాయి.

BRICS Summit 2026 : మోదీతో ఫోటోల కోసం పోటీ పడ్డ ప్రతినిధులు

బ్యాంకు ఖాతాల్లోని రూ.52.16 లక్షలు సీజ్

ఈడీ వివరాల ప్రకారం.. జీనా నివాసం నుంచి రూ.32 లక్షల నగదు, సుమారు 200.5 గ్రాముల బరువున్న బంగారం, వెండి నాణేలు, ఏడు బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. రోలెక్స్, రాడో, టిస్సోట్ వంటి బ్రాండ్లకు చెందిన 12 ఖరీదైన వాచ్‌లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అదనంగా జీనా, ఆయన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.52.16 లక్షలను కూడా సీజ్ చేసినట్లు ఈడీ తెలిపింది.

2016 నియామక పరీక్షల కుంభకోణంతో లింకులు

ఉత్తరాఖండ్ సబోర్డినేట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ 2016లో నిర్వహించిన గ్రామ పంచాయత్ వికాస్ అధికారి నియామక పరీక్షలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఓఎంఆర్ జవాబు పత్రాలను స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి అక్రమంగా బయటకు తరలించి, అనంతరం వాటిలో మార్పులు చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ వ్యవహారంలో అక్రమంగా డబ్బులు చేతులు మారినట్లు పోలీసు, విజిలెన్స్ దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా ఈడీ విచారణ కొనసాగిస్తోంది. జీనా చట్టబద్ధమైన ఆదాయానికి మించిన ఆస్తులు, ఖర్చులు కలిగి ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.

కాంగ్రెస్ పదవులకు హరీశ్ రావత్ రాజీనామా

ఈడీ సోదాల నేపథ్యంలో హరీశ్ రావత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పీఏపై వచ్చిన ఆరోపణల కారణంగా కాంగ్రెస్ పార్టీ అవినీతి వ్యతిరేక పోరాటానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడి పదవితో పాటు ఉత్తరాఖండ్ పీసీసీ ఎగ్జిక్యూటివ్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Harish Rawat: 'ఆరోపణలు నిజమైతే సిగ్గుపడతా'

ఈ వ్యవహారంపై హరీశ్ రావత్ ఎక్స్ వేదికగా స్పందించారు. చందన్ సింగ్ జీనా తనకు చాలా నమ్మకమైన వ్యక్తి అని, ఆయనపై వచ్చిన ఆరోపణలను తాను నమ్మలేకపోతున్నానని తెలిపారు. అయితే ఓఎంఆర్ షీట్ల అక్రమాల్లో జీనా పాత్ర ఉన్నట్లు ఆధారాలు బయటపడితే తాను సిగ్గుపడతానని పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన చుట్టూ ఉన్న వ్యక్తుల కారణంగా కాంగ్రెస్ పార్టీ అవినీతి వ్యతిరేక పోరాటం బలహీనపడకూడదనే ఉద్దేశంతోనే పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు హరీశ్ రావత్ స్పష్టం చేశారు.

Epaper: epaper.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha