ఏప్రిల్ 26వ తేదీన బెంగళూరులోని గౌరీపాళ్య సమీపంలో ఈ దృశ్యం కనిపించింది. శ్రేయాస్ శ్రేయు అనే నెటిజన్ ఈ ఫొటోను తీసి ట్విట్టర్ (X) వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉదయం 10:45 గంటలకు. పదరాయణపుర మెయిన్ రోడ్డు. వైరల్ అవుతున్న ఫొటోలో ఒక మైనర్ బాలుడు స్కూటర్ నడుపుతుండగా, అతని వెనుక మరో ఐదుగురు చిన్నారులు ప్రమాదకరంగా కూర్చుని ఉన్నారు. ఆరుగురిలో ఎవరూ హెల్మెట్ ధరించలేదు. లైసెన్స్ లేని మైనర్ వాహనం నడపడం చట్టరీత్యా తీవ్రమైన నేరం.
Viral Photo: స్పందించిన పోలీసులు
ఈ పోస్ట్‌పై బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు తక్షణమే స్పందించారు. ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం మగడి రోడ్డు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. వాహన నంబర్ ఆధారంగా యజమానిని గుర్తించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు పిల్లల తల్లిదండ్రులపై మండిపడుతున్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయని, తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు ఇది కేవలం ఫొటో కోసం చేసిన పనిలా ఉందని, నిజంగా రోడ్డుపై ప్రయాణించారా లేదా అన్నది విచారణలో తేలాలని అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
బెంగాల్ రెండో దశ ఎన్నికలు.. 11 గంటలకే 40 శాతానికి చేరువలో ఓటింగ్

