Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పోచమ్మ తల్లి నాలుగవ వార్షికోత్సవ బోనాలు!

పోచమ్మ తల్లి నాలుగవ వార్షికోత్సవ బోనాలు!

వార్త 1 week ago

Takkadapally Pochamma Thalli Bonalu: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని తక్కడపల్లి గ్రామం ఆదివారం నాడు ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. గ్రామంలో వెలిసిన పోచమ్మ తల్లి ఆలయ నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామస్తులంతా కలిసి బోనాల పండుగను అత్యంత వైభవంగా, ఘనంగా జరుపుకున్నారు.

తక్కడపల్లి గ్రామంలో వెలిసిన పోచమ్మ తల్లి ఆలయాన్ని స్థాపించి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను గ్రామస్తులు కులమతాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

శాస్త్రోక్తంగా పూజలు.. నైవేద్యాల సమర్పణ

ఆదివారం ఉదయం నుండే ఆలయంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. అర్చకులు రాజు పంతులు ఆధ్వర్యంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరిపి, నైవేద్యాన్ని సమర్పించారు. గ్రామస్తులంతా తమ ఇళ్ల వద్ద భక్తితో తయారు చేసిన నైవేద్యాలను, ఘటాలను అమ్మవారికి సమర్పించి తమ కుటుంబాలను చల్లగా చూడాలని, మనోవాంఛలు తీర్చాలని మొక్కులు చెల్లించుకున్నారు.

Takkadapally Pochamma Thalli Bonalu:బగిలి పటేల్ ఇంటి నుండి ఊరేగింపు.. హిజ్రాల సందడి

గ్రామ ఆనవాయితీ ప్రకారం.. స్థానిక బగిలి పటేల్ నివాసం నుండి అమ్మవారి బోనాల ఊరేగింపు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. డప్పు డోలు వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాలు, సిరిమువ్వల సప్పుడు నడుమ మహిళలు బోనాలను తలపై పెట్టుకుని గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ వేడుకల్లో హిజ్రాలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొని, తలపై బోనమెత్తి సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారి ఆటపాటలతో ఊరేగింపులో మరింత సందడి నెలకొంది.

 Priest Raju Panthulu performing traditional rituals and offering naivedyam to Goddess Pochamma at the temple

అమ్మవారికి బోనాలు సమర్పించిన అనంతరం, ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు మరియు గ్రామస్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీగా అన్నప్రసాద వితరణ (అన్నదానం) ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో మునిపల్లి మండల పరిధిలోని భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

RTC విలీనంపై సర్కార్ కసరత్తు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha