Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పొగాకు పంటకు గిట్టుబాటు ధర దక్కేనా?

పొగాకు పంటకు గిట్టుబాటు ధర దక్కేనా?

వార్త 1 week ago

Ongole Tobacco farmers:పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, పొగాకు కొనుగోళ్ల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.1000 కోట్లు కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లాలో వేలాది మంది రైతులు పొగాకు సాగుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నప్పటికీ గిట్టుబాటు ధరలు లేకపోవడం, కొనుగోళ్లలో జాప్యం, మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులు అప్పులు చేసి సాగు చేసిన పంటకు సరైన ధర లభించకపోవడంతో అనేక కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయని పేర్కొన్నారు.

Read also: Tungabhadra Project CMs Meeting:కేంద్రమంత్రితో తుంగభద్రపై సీఎంల కీలక భేటీ

 Tobacco farmers demand fair price

Ongole Tobacco farmers:కొనుగోళ్లలో జాప్యం – ప్రభుత్వాలకు విజ్ఞప్తి

పొగాకు రైతుల వద్ద నిల్వ ఉన్న ఉత్పత్తిని వెంటనే కొనుగోలు చేసి పెట్టుబడులు, శ్రమ వృథా కాకుండా తగిన మద్దతు ధర కల్పించాలని కోరారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్న సమయంలో రైతులకు అండగా నిలవడం ప్రభుత్వాల బాధ్యత అని ఆయన అన్నారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించా లని సూచించారు. రైతుల పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకుని అత్యవసరం గా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పొగాకు బోర్డు కూడా రైతులకు అనుకూ లంగా వ్యవహరించి కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని కోరారు. ఇదే సందర్భంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కిసాన్ మోర్చా అధ్యక్షుడు చుండూరి రంగారావు ఆధ్వర్యంలో రైతులు నిరసన దీక్ష చేపట్టారు.

Epaper: epaper.vaartha.com

శ్రీకాళహస్తి దారిదోపిడి కేసులో 8మంది అరెస్టు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha