Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీకాళహస్తి దారిదోపిడి కేసులో 8మంది అరెస్టు

శ్రీకాళహస్తి దారిదోపిడి కేసులో 8మంది అరెస్టు

వార్త 1 week ago

Srikalahasti Highway Robbery:4 వాహనాలు, రూ.3 లక్షలు స్వాధీనం. శ్రీకాళహస్తి- తిరుపతి జాతీయ రహదారిపై ఈ నెల 15న తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం అంజిమేడు వద్ద రవీంద్రరెడ్డి అనే వేణును బెదిరించి రూ.15 లక్షలు దోచుకున్న కేసులో బుధవారం 8 మందిని అదుపులో తీసుకొని వారి నుంచి నాలుగు వాహనాలను, రూ.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎఎస్పి అర్లశ్రీనివాసులు మీడియాకు తెలిపారు.

రవీంద్ర రెడ్డి రూ.15లక్షలతో తన వాహనంలో పయనిస్తుండగా ముందుగా గుర్తించిన ముఠా దారికాచి కత్తులతో బెదిరించి నగదును అపహ రించినట్లు అందిన ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పి సుబ్బరాయుడు సంబంధిత అధికారులను కేసుకు సంబంధించి ప్రత్యేక బృందాలను నియమించాలని ఆదేశించారు. ఈ మేరకు రేణిగుంట డియసిపి శ్రీనివాస్, ఏర్పేడు సిఐలు శ్రీకాంత్రెడ్డిలు సంయుక్తంగా ప్రత్యేక బృందాన్ని నియమించారు.

Read also: Nalgonda Quadruple Murder Case: నల్లగొండ క్వాడ్రపుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్

 Srikalahasti National Highway highway robbery case

Srikalahasti Highway Robbery:ముఖ్య నిందితుల వివరాలు

కేసుల ఛేదనలో ఎంతో చాకచక్యం ఉన్న బృందం ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి, రవిప్రకాష్ వారి సిబ్బంది గతంలో నేరాలకు పాల్పడిన వారిని పరిగణలోకి తీసుకొని విచారణ చేపట్టారు. వారి చొరవతో స్వల్ప కాలంలోనే నిందితులను అదుపు లో తీసుకున్నారు. ఈ కేసులో మొదటి నిందితులుగా ఓ మహిళ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె కోసం ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఈ కేసులు 8మందిని అదుపులో తీసుకున్నట్లు వివరించారు. మొదటి నిందితులు లక్ష్మీకాంతమ్మ పరారిలో ఉండగా అదుపులో తీసుకున్న వారిలో బాలసాల దామోదరం (బంగారుపాళెం), వెంకటరమణ (శ్రీనివాస మంగాపురం), మునియప్ప వెంకటాచలపతి(కోలారు), నారాయణ స్వామి (కోలార్), సయ్యద్ రోషన్ (మొగిలి బంగారుపాళెం), అంజి (గంగవరం చిత్తూరు), గుణశేఖర్ (జీవకోన తిరుపతి), శ్రీనివాసులు (చిల్లకూరు నెల్లూరు జిల్లా) ఉన్నారు. ఈ కేసును ఛేదించటంలో ఏర్పేడు సిఐ శ్రీకాంత్రెడ్డి, ఎస్ఐలు శ్రీకాంత్రెడ్డి రవి ప్రకాష్, పోలీసులను జిల్లా అధికారులు ప్రశంసించారు.

Epaper: epaper.vaartha.com

పలమనేరులో అంతరాష్ట్ర కిడ్నాప్ ముఠా అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha