Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పోలవరం ప్రాజెక్టును హెలికాప్టర్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన బాబు

పోలవరం ప్రాజెక్టును హెలికాప్టర్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన బాబు

వార్త 3 weeks ago

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన హెలికాప్టర్‌ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ (Aerial view) లో వీక్షించారు.

స్పిల్‌వే నుంచి గోదావరి వరద నీటి ప్రవాహాన్ని, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య ప్రస్తుతం జరుగుతున్న పనుల సరళిని ఆయన విహంగ వీక్షణం ద్వారా నిశితంగా పరిశీలించారు.

Read Also: AP CPS employees old pension scheme: ఏపీ సిపిఎస్ ఉద్యోగులకు శుభవార్త

 Babu inspected the Polavaram project via an aerial view from a helicopter.

CM Chandrababu: క్షేత్రస్థాయిలో పరిశీలన.. అధికారులతో సమీక్ష

హెలికాప్టర్ పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా క్షేత్రస్థాయిలోకి దిగి ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. ముఖ్యంగా ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం (ECRF) లోని గ్యాప్ 1, గ్యాప్ 2 పనుల పురోగతిపై అధికారులను అడిగి ఆరా తీశారు. వీటితో పాటు నిర్మాణ దశలో ఉన్న జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని (Hydroelectric Project) కూడా ఆయన సందర్శించారు. ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, వరద ముప్పును తట్టుకుంటూ పనులను ఎలా ముందుకు తీసుకెళ్తున్నారనే వివరాలను జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి మ్యాప్‌ల ద్వారా వివరించారు.

మంత్రి నిమ్మలతో కలిసి పర్యటన

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిపిన ఈ ఉన్నత స్థాయి పర్యటనలో ఆయన వెంట రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు ఆ శాఖకు చెందిన ఈఎన్‌సీ, ఇతర కీలక అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో వరదలు వస్తున్న సమయంలోనే సీఎం స్వయంగా ప్రాజెక్టు వద్దకు వెళ్లి పనులను సమీక్షించడం రాజకీయంగా, సాంకేతికంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Epaper: epaper.vaartha.com

ధవళేశ్వరం బ్యారేజీ కొత్త గేట్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha