YouTuber Rama Nandana: ప్రముఖ యూట్యూబ్ ఛానల్ 'నందూస్ వరల్డ్' నిర్వాహకురాలు రమా నందన పోలీసుల విచారణకు హాజరయ్యారు. లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసాల రెన్యువల్ చేస్తామని చెప్పి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆమెను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఈ వ్యవహారంపై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విదేశాల నుంచి సోమవారం తిరిగి వచ్చిన రమా నందనను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
Read Also : Mahabubabad crime: భర్త ఫోన్ ఎత్తలేదని ఇంత కఠిన నిర్ణయమా? తల్లి
YouTuber Rama Nandana appeared for police questioning.
YouTuber Rama Nandana: యూకే వీసాలు, ఉద్యోగాల పేరుతో కోట్ల మోసం
లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, యూకే వీసాల రెన్యువల్ చేయిస్తామని చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేశారంటూ బాధితుడు క్రాంతికుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో రమా నందనతో పాటు ఆమె భర్త జాగర్లమూడి మధుకర్, అత్తామామలపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే దర్యాప్తు సంస్థలు వీరిపై లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) జారీ చేశాయి.
ఈ-మెయిల్ సంప్రదింపులు.. 41A నోటీసులు జారీ
విచారణకు పూర్తిగా సహకరిస్తానని, కావున లుక్ అవుట్ నోటీసులు ఉపసంహరించుకోవాలని కోరుతూ 15 రోజుల క్రితమే రమా నందన విజయవాడ పోలీస్ కమిషనర్, డీసీపీలకు ఈ-మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. అయితే లుక్ అవుట్ నోటీసు తొలగించడం సాధ్యం కాదని, స్వయంగా వచ్చి విచారణకు హాజరుకావాలని పోలీసులు స్పష్టం చేయడంతో ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెకు 41A నోటీసులు అందించారు. రమా నందన విచారణ పూర్తయిన తర్వాత ఆమె భర్త మధుకర్ జాగర్లమూడి కూడా యూకే నుంచి ఇండియాకు వచ్చి పోలీసు విచారణకు హాజరుకానున్నట్లు సమాచారం.

