Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పోలీసులకు లొంగిపోయిన మాజీ సీఐ చిన్నా మల్లయ్య

పోలీసులకు లొంగిపోయిన మాజీ సీఐ చిన్నా మల్లయ్య

వార్త 1 week ago

Chinna Mallayya surrender: లైంగిక దాడి ఆరోపణలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వినుకొండ మాజీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) చిన్నా మల్లయ్య ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

కేసు నమోదైన నాటి నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఆయన, శుక్రవారం రాత్రి వినుకొండ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు ఉన్నతాధికారులు అధికారికంగా ధ్రువీకరించారు. మల్లయ్య లొంగుబాటుతో పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలను వేగవంతం చేశారు.

Read Also : Janasena : కార్యకర్తలను నోరు మూసుకోవాలంటూ నాగబాబు వార్నింగ్.. ప్రకాశ్ రాజ్ కౌంటర్

 Former CI Chinna Mallaiah surrenders to police

Chinna Mallayya surrender: ఉద్యోగం నుంచి శాశ్వత తొలగింపు

వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ, తనపై సీఐ చిన్నా మల్లయ్య లైంగిక దాడికి పాల్పడ్డారంటూ గతంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా వినుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఆరోపణలతో అప్పటికే వీఆర్‌లో ఉన్న మల్లయ్యను, ఈ కేసు నేపథ్యంలో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టులలో ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించినప్పటికీ.. ఉభయ కోర్టులు ఆయన పిటిషన్లను తిరస్కరించాయి. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ కొట్టివేతకు గురైన వెంటనే, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి ఆయనను సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగిస్తూ (డిస్మిస్) ఉత్తర్వులు జారీ చేశారు.

కోర్టుల చుట్టూ తిరిగినా బెయిల్ రాకపోవడం, ఉద్యోగం కూడా ఊడిపోవడంతో చిన్నా మల్లయ్యకు న్యాయపరమైన అన్ని దారులు మూసుకుపోయాయి. అంతకుముందు గురువారం నాడు ఆయన మారువేషంలో వినుకొండ కోర్టు ప్రాంగణానికి వచ్చినట్లు సమాచారం. అయితే అక్కడ న్యాయమూర్తి సెలవులో ఉన్నారని తెలుసుకొని వెనుదిరిగారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమైనప్పటికీ ఆయన వారి కళ్లుగప్పి తప్పించుకున్నారు. చివరకు ఎటూ తేలకపోవడంతో శుక్రవారం రాత్రి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha