Prakash Raj Vs Janasena ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ (JSP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
పార్టీ అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఎప్పుడైనా లీడర్ తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. నాయకత్వాన్ని ప్రశ్నించకుండా, ఎలాంటి బేషజాలు లేకుండా కార్యకర్తలు నోరు మూసుకొని పవన్ కళ్యాణ్ వెంటే నడవాలని పిలుపునిచ్చారు. నాగబాబు చేసిన ఈ 'నోరు మూసుకోండి' వ్యాఖ్యలపై బహుభాషా నటుడు, సామాజిక అంశాలపై స్పందించే ప్రకాశ్ రాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “మేమేమీ బానిసలుగా బతకడానికి గొర్రెలం కాదు.. ఇలాంటి బెదిరింపు ధోరణి రాజకీయాలకు స్వస్తి పలకాలి; ప్రశ్నించడం అనేది పౌరుడిగా మా హక్కు, ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడైనా ప్రజలకు, క్యాడర్‌కు సమాధానం చెప్పాల్సిందే” అంటూ సోషల్ మీడియా ద్వారా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Read Also : అమరావతిపై జగన్ కుట్రలు..దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు!

జనసైనికుల ఆగ్రహం.. ప్రకాశ్ రాజ్‌పై పవన్ ఫ్యాన్స్ రివర్స్ ఎటాక్
నాగబాబు వ్యాఖ్యలు ఒకవైపు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారగా, మరోవైపు ఈ వివాదంలోకి ప్రకాశ్ రాజ్ ఎంటర్ అవ్వడంపై జనసేన శ్రేణులు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది జనసేన పార్టీ అంతర్గత విషయమని, నాయకత్వానికి-క్యాడర్‌కు మధ్య ఉన్న అనుబంధాన్ని ఉద్దేశించి నాగబాబు మాట్లాడితే, ఇందులో ప్రకాశ్ రాజ్‌కు ఏం సంబంధం అంటూ వారు నిలదీస్తున్నారు. కేవలం పవన్ కళ్యాణ్‌ను, జనసేనను టార్గెట్ చేయడానికే ప్రకాశ్ రాజ్ ప్రతి చిన్న విషయానికి స్పందిస్తూ రచ్చ చేస్తున్నారని ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌కు దిగుతున్నారు. లీడర్‌షిప్ పట్ల విధేయతకు, ప్రజాస్వామ్య బద్ధంగా ప్రశ్నించే హక్కుకు మధ్య జరుగుతున్న ఈ సరికొత్త సిద్ధాంత యుద్ధం ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

