Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దొంగల బీభత్సం: 100 తులాల బంగారం, కిలో వెండి అపహరణ!

దొంగల బీభత్సం: 100 తులాల బంగారం, కిలో వెండి అపహరణ!

వార్త 3 months ago

Chilipally Theft: చీలపల్లిలో భారీ దొంగతనం.. వంద తులాలకు పైన బంగారం కిలో వెండి అపహరణ. నాలుగు ఇళ్లలో దొంగల బీభత్సం. భయాందోళనలో ప్రజలు, మెదక్ జిల్లా (పెద్ద శంకరంపేట).

Read Also:Koudipally News: రాజపేటలో అక్రమంగా చెరువు మట్టి తరలింపు

Chilipally Theft: మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల పరిధిలోని చీలిపల్లిలో గురువారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. నాలుగు ఇండ్లలో దొంగలు బీభత్సం సృష్టించి 100 తులాలకు పైన బంగారం, కిలో వెండిని అపహ రించారు. వివరాల్లోకి వెళితే.. రాయిని రాములు ఇంట్లోనే వంద తులాలకు పైన బంగారు నగలు, కిలో వెండి అపహరించినట్లు బాధితులు తెలిపారు. ఏసి రెడ్డి మాణిక్ రెడ్డి ఇంట్లో రెండు తులాల బంగారం, జగ్గు చిన్న మల్లారెడ్డి ఇంట్లో మూడు మాసాల బంగారం నగలు, జగ్గు అరుంధతి ఇంట్లో కమ్మలు, పట్టగొలుసులు దొంగలించినట్లు బాధితులు తెలిపారు. ప్రస్తుతానికి సంఘటన స్థలాన్ని అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి పెద్ద శంకరంపేట ఎస్సై ప్రవీణ్ రెడ్డిలు సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

మెదక్ పట్టణంలోని ఆదర్శ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో ఘరానా మోసం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha