హర్మూజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అగ్రరాజ్యం ఒకవైపు చర్చలకు ప్రాధాన్యమిస్తూనే, మరోవైపు సైనిక పట్టు సడలించకుండా ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది.
Iran-America War
Iran-America War: రాజకీయ వ్యూహం – చర్చలకు అవకాశం
అమెరికా చేపట్టిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ అనేది ప్రధానంగా వాణిజ్య నౌకల రక్షణ కోసం ఉద్దేశించినది. అయితే, పాకిస్థాన్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్న తరుణంలో, ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలు సఫలం కావాలని ట్రంప్ ఈ ప్రాజెక్టును తాత్కాలికంగా ఆపారు. “ఒప్పందం ఖరారవుతుందో లేదో చూడటానికి ఇది ఒక చిన్న విరామం మాత్రమే” అని ట్రంప్ స్పష్టం చేయడం గమనార్హం. ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆగినప్పటికీ, ఇరాన్‌పై విధింఛిన ‘నావల్ బ్లాకేడ్’ (నౌకాదళ దిగ్బంధం) మాత్రం కొనసాగుతోంది. దీని అర్థం హర్మూజ్ జలసంధి గుండా ఇరాన్ కార్యకలాపాలను అమెరికా నిశితంగా గమనిస్తూనే ఉంటుంది.
ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20-30% వాటా
ఇరాన్ చిన్న తరహా యుద్ధ నౌకలు వాణిజ్య నౌకలకు ముప్పుగా మారుతున్నాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రుబియో ఆరోపించారు. హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20-30% వాటాను కలిగి ఉంది. చర్చల ద్వారా
ఇక ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య సందేశాల మార్పిడి జరుగుతోంది. అయితే అమెరికా ప్రతిపాదనలపై ఇరాన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అణు కార్యక్రమం కూడా ఈ చర్చల్లో కీలక అంశంగా మారింది. ఇరాన్ అణ్వాయుధాల దిశగా కదులుతోందని అమెరికా ఆరోపిస్తుండగా, ఇరాన్ మాత్రం తన కార్యక్రమం శాంతియుతమని చెబుతోంది. మొత్తానికి ప్రస్తుతం పరిస్థితి చూస్తే హర్మూజ్‌లో ఉద్రిక్తతలు తగ్గకపోయినా, చర్చల ద్వారా పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌కు ఇచ్చిన తాత్కాలిక విరామం ఆ దిశలో కీలక మలుపుగా మారే అవకాశముంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

