Monalisa: 'కుంభమేళా' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మోనాలిసా తాజాగా మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. తన ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందని ఆరోపిస్తూ ఆమె పోలీసు గడపొక్కారు.
తనకు తక్షణమే రక్షణ కల్పించాలంటూ న్యాయస్థానాన్ని, పోలీసులను కోరారు. తన న్యాయవాదితో కలిసి ఆదివారం కేరళలోని ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మోనాలిసా, తన భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ అధికారులకు లిఖితపూర్వక దరఖాస్తును సమర్పించారు.
తండ్రిపైనే సంచలన ఆరోపణలు
పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం మోనాలిసా మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు బయటపెట్టారు. తన స్వంత తండ్రే తన పాస్‌పోర్ట్‌తో పాటు డబ్బును బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు.
అంతటితో ఆగకుండా తన తండ్రి వల్లనే ప్రస్తుతం తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తనకు పోలీసు ప్రొటెక్షన్ కావాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

