Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి తీరుతాం.. ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి తీరుతాం.. ఉత్తమ్ కుమార్ రెడ్డి

వార్త 2 weeks ago

ఇప్పటికే డిపిఆర్ కూడా సిద్ధమైంది

రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Pranahita Chevella Project: ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్త మ్ కుమార్రెడ్డి స్పష్టం చేశారు.

ఎన్నికల మేనిఫెస్టోలో హమీ మేరకు ప్రాజక్టు డీపీఆర్ను సిద్ధం చేశామన్నారు. డిపిఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.

Read Also: TG Police Promotions: తెలంగాణ పోలీస్ శాఖలో ప్రమోషన్ల జాతర.. ఆ జిల్లాల వారికే ప్రాధాన్యం!

 We will build a life-saving and safe shelter: Uttam.

Pranahita Chevella Project: తుమ్మిడిహట్టి నుండి ఎల్లంపల్లికి నీటి తరలింపు

ఈ మేరకు బుధవారం సిఎంతో నీటిపారుదలశాఖ సమీక్షా సమావేశానికి ముందు కీలకమైన నీటి పారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ ఉన్నతాధికారులతో చర్చించారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నామన్నారు. తుమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లికి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు పరిశీలి స్తున్నా మన్నారు. ఆర్వీ అసోసియేట్స్, ఐఐటీ హైదరాబాద్ సమిష్టిగా 4 ప్రతి పాదనలు చేసినట్లు చెప్పారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం పునరుద్ధరణకు అవసరమైన పరీక్షలను వచ్చే వర్షాకాలం సీజన్ లోపు పూర్తిచేసేలా చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రతి 1.5 మీటర్ దూరంలో ఎస్పీటీ టెస్టులు, 3 మీటర్ల పెర్మిబులిటీ టెస్టులు జరపనున్నామన్నారు. బ్యారేజీల పునరుద్ధరణ కోసం నియమించిన సమన్వయ కమిటీ సందర్శన టైమ్ లైన్ ను ఫిక్స్ చేసుకోవాలన్నారు.

అధికారులకు ఆదేశాలు

ప్రతి ప్రతిపాదనకు అయ్యో ఖర్చు, అను కూల, ప్రతీ కూలతలపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. బోర్లు వేస్తున్న సమయంలో రాయి వచ్చినప్పటికీ రాయి లోపటికి 5 మీటర్లు లోతుగా బోర్లు వెయ్యాలన్నారు. సిడబ్లుపిఆర్ఎస్ డైరెక్టర్ క్షేత్ర స్థాయిలో ఉంటూ పునరు ద్ధరణకు అవసరమైన పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలన్నారు. పునరుద్ధరణ కోసం జరుగుతున్న పురోగతి పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఎన్డీఎస్కు సమగ్రంగా సమాచారం అందించాలని అధికారులకు సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha