వర్సిటి విద్యార్థుల నిరసన
Agricultural University: రాష్ట్రంలో హార్టికల్చర్ కోర్సుల నిర్వహణకు ప్రత్యేకంగా యూనివర్సిటీ ఉండగా అదనంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోనూ ఉద్యాన కోర్సులకు సీట్లు కేటాయించడం సరైన నిర్ణయం కాదని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.
ఈచర్యలతో హార్టికల్చర్ యూని వర్సిటీ ప్రాముఖ్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
No Horticulture Courses in Agri University
Agricultural University: విద్యార్థుల డిమాండ్లు
ఈ మేరకు బుధవారం కొండా లక్ష్మణ్ బాపూజి తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సి టిలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. వచ్చే విద్యా సంవత్సరంనుంచి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 30 బిఎస్సి హార్టికల్చర్ సీట్లు, 8 ఎంఎస్సి సీట్లు కేటాయించే ప్రతిపాదనలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థుల అవకాశాలు తగ్గిపోతాయని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. హార్టికల్చర్ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం సీరియస్గా పరిగణించిసముచిత నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

