రాష్ట్రం లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి మంగళవారం నుంచి ఏపీ ఈఏపీ సెట్ ప్రవేశ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల కోసం 48 పట్టణాల్లో 142 పరీక్షల కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఈఏపీ సెట్కు 3 లక్షల 55 వేలమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు అందరు హల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. నేటి నుంచి 18 వరకు ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. ఈనెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు నిర్వహించనున్నారు. నుంచి 12, మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు రెండు స్లాట్లలో పరీక్షలు నిర్వహించనున్నారు.
Read also: Bandi Nityananda Reddy: కడప మాజీ డిప్యూటీ మేయర్ కు 14 రోజులు రిమాండ్
EAPCET Entrance Exams Have Begun
AP EAPCET 2026: కట్టుదిట్టమైన నిబంధనలు
కంప్యూటర్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష ప్రారంభానికి నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరిస్తామని ముందే ప్రకటిస్తామని వెల్లడించడంతో విద్యార్ధులు అప్రమత్తమయ్యారు. పూర్తి సీసీ కెమేరా నిఘాతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షా కేంద్రాలో మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేసారు. వైద్య సహయకులను నియమించారు. ఇక ఈఏపీ సెట్ పరీక్ష కేంద్రాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ మధుమూర్తి పరిశీలించారు. పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఏడాది 52 శాతం మాత్రమే సీట్లు భర్తీ అవుతున్నాయని ఈసారి ఇంజినీరింగ్లో క్వాంటం టెక్నాలజీ కోర్సులు ప్రవేశపెట్టామని వెల్లడించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

