Kadapa News: కడప మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డిని మొబైల్ కోర్టు జడ్జి 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కడప మాజీ డిప్యూటీ మేయర్ అంటే నిత్యానంద రెడ్డి పెద్ద దస్తగిరి హత్య కేసులో ముద్దాయిగా ఉండటంతో మంగళవారం రోజు కడప మొబైల్ కోర్టులో రిమ్స్ పోలీసులు హాజరుపరచగా ఆయనను 14 రోజులు రిమాండ్ విధిస్తూ కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పెద్ద దస్తగిరి హత్య కేసులో ముద్దాయిగా ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి గత కొన్ని రోజులుగా పోలీసులకు దొరకకుండా అజ్ఞాతంలోనికి వెళ్లి హైకోర్టులో ముందస్తు బేయిల్ దరఖాస్తు చేసుకొనడం జరిగింది.
Kadapa Ex Deputy Mayor Remand News
Kadapa News: హైకోర్టు బెయిల్ తిరస్కరణతో లొంగుబాటు
ముందస్తు బెయిల్ కోసం మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి దరఖాస్తును హైకోర్టు తిరస్కరించడంతో సోమవారం నాడు తన తన న్యాయవాది తో కలిసి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఎదుట లొంగిపోయాడు. దీంతో జిల్లా ఎస్పీ తెన్సి పోలీసులకు అప్పగించడం జరిగింది. సోమవారం, మంగళవారం విచారించిన ప్రిన్సి పోలీసులు ఎట్టికేలకు కడప మొబైల్ కోర్టులో హాజరు పరిచారు దీంతో మొబైల్ కోర్టు మాజిస్ట్రేటు ఆసియా ప్రియ మాజీ డిప్యూటీ మేయర్కు 14 రోజులు రిమాండ్ విధించి కడప సెంట్రల్ జైలుకు తరలించాలని రిమ్స్ పోలీసులకు ఆదేశించడంతో వారు కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
కోర్టు ప్రాంగణంలో హైటెన్షన్ మధ్య జైలుకు
అజ్ఞాతంలో ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ను తిరస్కరించడంతో సోమవారం నాడు కోర్టులో లొంగిపోతున్నాడు అన్న సమాచారం పోలీసులకు అందడంతో జిల్లా కోర్టు ప్రాంగణమంతా పోలీసులు నిండిపోయారు. కోర్టుకు వచ్చే ప్రతి వాహనాన్ని విస్తృత తనిఖీలు చేశారు. అయితే ఇటిక్యాలకు మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి తన న్యాయవాదితో కలిసి పోలీస్ కార్యాలయానికి వెళ్లి లొంగిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకొని పోలీస్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డిని కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్కు తరలించి తీసుకుపోయారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
హనుమాన్ సాక్షిగా ప్రమాణం చెయ్.. బండి సంజయ్‌కు RS ప్రవీణ్ కుమార్ సవాల్

