Prabhas Birthday : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23) దగ్గరపడుతుండటంతో ఆయన అభిమానుల్లో ఉత్సాహం గగనాతలాన్ని తాకుతోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభాస్ రాబోయే చిత్రం 'ఫౌజీ' (ప్రచారంలో ఉన్న టైటిల్) మేకర్స్ అభిమానులకు ఊహించని రేంజ్‌లో ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో బలమైన ప్రచారం సాగుతోంది.
అక్టోబర్ 23న దాదాపు మూడు నిమిషాల నిడివితో కూడిన ఒక పవర్‌ఫుల్ స్పెషల్ టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్రణాళికలు రచిస్తోంది. ఈ టీజర్ ద్వారా సినిమా మూడ్, ప్రభాస్ పాత్ర స్వభావాన్ని చాలా గ్రాండ్‌గా ఆవిష్కరించబోతున్నారని తెలుస్తోంది. అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ అభిమానుల్లో భారీ అంచనాలను నెలకొల్పింది.
Prabhas Fauji Movieవిడుదల వాయిదా.. టీజర్‌తో సర్ ప్రైజ్ కానుక!
వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ తొలత భావించారు. అయితే, నిర్మాణ నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ (VFX) వర్క్ అద్భుతంగా రావడం కోసం సినిమా విడుదలను వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు సమాచారం. ఈ వాయిదాతో కొంత నిరాశ చెందిన అభిమానులను ఖుషీ చేసేందుకే మేకర్స్ ఈ మూడు నిమిషాల టీజర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ లుక్, యాక్షన్ సీక్వెన్సెస్ హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండబోతున్నాయని, ఈ పుట్టినరోజు అప్‌డేట్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా కావడం ఖాయమని సమాచారం.

