Prabhas Fouji Movie: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి చారిత్రక నేపథ్యంతో కూడిన భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. టాలెంట్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాకు 'ఫౌజీ' అనే టైటిల్ ఖరారు చేశారు.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసి అభిమానులకు అదిరిపోయే కానుక అందించింది. ఈ సినిమాను 2027 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తొలుత ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబరు 3న విడుదల చేయాలని భావించినప్పటికీ, తాజాగా మార్చి 19కి షిఫ్ట్ చేశారు.
immortal: ఓటీటీలో జీవీ ప్రకాశ్, కయాదు హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Official glimpse of Prabhas’ ‘Fauji’ released… when is the release date?
'ఫౌజీ' టీజర్‌లో చూపించిన సన్నివేశాలు సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బెర్లిన్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ మధ్య జరిగే సంభాషణ ఈ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బ్రిటిష్ పాలన నుంచి భారత్‌కు విముక్తి కల్పించేందుకు జర్మనీ సాయం చేయాలని బోస్ కోరగా.. బ్రిటన్ రెండు శతాబ్దాలుగా భారత్‌ను పాలిస్తోందని, ఓడిపోయే పోరాటానికి తాను మద్దతివ్వనని హిట్లర్ బదులిచ్చే సీన్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.
Prabhas Fouji Movie: బ్రిటిష్ సైన్యానికే అంతుచిక్కని భారతీయ గూఢచారి
హిట్లర్‌కు భారతీయుల సత్తా ఏంటో బోస్ వివరిస్తూ.. బ్రిటిష్ పాలకులకు జర్మనీ గూఢచారుల గురించి తెలుసని, కానీ భారతీయ గూఢచారి ఫౌజీ గురించి ఏమీ తెలియదని చెబుతారు. సింగపూర్‌ను బ్రిటన్ నుంచి జపాన్ స్వాధీనం చేసుకోవడంలో ఫౌజీ కీలక పాత్ర పోషించినట్లు టీజర్‌లో చూపించారు. ఒక సైనికుడిగా, వ్యూహకర్తగా, గూఢచారిగా అతడి ప్రతిభను బోస్ పాత్ర కొనియాడుతుంది. అంతేకాకుండా, భగవద్గీత ఆధారంగా ఫౌజీ ఓ రహస్య కోడ్ భాషను రూపొందించినట్లు, జర్మనీకి చెందిన 'ఎనిగ్మా' కోడ్ సిస్టమ్ కంటే దీన్ని ఛేదించడం కష్టమని బ్రిటిష్ పాలకులే అంగీకరించినట్లు ఇందులో చూపించారు. అతడి అసలు పేరెవరికీ తెలియదని, బ్రిటిష్ వాళ్లు మాత్రం 'ఫౌజీ' అని పిలుస్తారని బోస్ చెప్పడంతో టీజర్ మరింత రక్తికట్టించింది.
భారీ తారాగణంతో 1940ల కాలం నాటి కల్పిత చారిత్రక కథ
1940ల కాలం నేపథ్యంలో సాగే ఓ కల్పిత చారిత్రక కథగా 'ఫౌజీ' తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి నటిస్తుండగా.. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్, జయప్రద వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు ప్రాణం తాకే సంగీతం అందిస్తుండగా, సుదీప్ ఛటర్జీ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో 'సీతారామం' వంటి క్లాసికల్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హను రాఘవపూడి, ఈసారి ప్యాట్రియాటిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు.
ఈ సినిమా ఎలాంటి పౌరాణిక చిత్రం కాదని, కేవలం భగవద్గీత నుంచి తాత్విక స్ఫూర్తిని మాత్రమే తీసుకున్నామని దర్శకుడు ఇప్పటికే స్పష్టం చేశారు. బ్రిటిష్ పాలన కాలంలోని అచ్చమైన దేశభక్తి, మానవీయ భావోద్వేగాలు, సామాజిక రాజకీయ సంఘర్షణలు ఈ సినిమాలో ప్రధానంగా హైలైట్ కానున్నాయి.
Epaper: epaper.vaartha.com

