Prabhas Health Update: దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఫౌజీ' షూటింగ్‌లో హీరో ప్రభాస్ కు తీవ్ర గాయాలు అయ్యాయంటూ, సోషల్‌మీడియా, కొన్ని వెబ్‌సైట్లలో కథనాలు వైరల్‌గా మారాయి.
ఈ వార్తలతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ప్రభాస్ ఆరోగ్యం గురించి అనేక ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రభాస్ టీమ్ అధికారికంగా స్పష్టం చేసింది.
Mrunal Thakur: రూమర్స్‌ను పట్టించుకుంటే కెరీర్‌పై ఫోకస్ చేయలేను

కంగారు పడాల్సిన పనిలేదు
సినిమా సెట్స్‌లో ప్రభాస్‌కు ఎలాంటి గాయం కాలేదని, ఆయన ఈరోజు కూడా షూటింగ్‌లో పాల్గొన్నారని టీమ్ స్పష్టం చేసింది. సెట్స్‌లో చిన్నచిన్న ప్రమాదాలు సహజమని, ప్రభాస్ చేతికి స్వల్పంగా గీత పడిందని, దానికి చికిత్స అవసరం లేదని, అభిమానులు కంగారు పడాల్సిన పనిలేదని ప్రభాస్ టీమ్ వెల్లడించింది.

