Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రభుత్వ పాఠశాలల నుంచే గొప్ప విజయాలు సాధ్యం.. మంత్రి వివేక్

ప్రభుత్వ పాఠశాలల నుంచే గొప్ప విజయాలు సాధ్యం.. మంత్రి వివేక్

వార్త 3 weeks ago

Chegunta Government School: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకుని క్రమశిక్షణతో కష్టపడితే దేశంలోనే అత్యున్నత స్థానాలను చేరుకోవచ్చని శక్తి ( కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి అన్నారు.

మెదక్ జిల్లా చేగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో శనివారం surfay School Kits ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని విద్యార్థులకు ఉచిత స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు.

Read Also : Peerzadiguda Girl Death Mystery: అర్ధరాత్రి నగ్నంగా వీధుల్లో యువతీ..ఊహించని ట్విస్ట్

 Great successes are possible through government schools: Minister Vivek.

Chegunta Government School: లక్ష్యసాధనలో క్రమశిక్షణ, ఉపాధ్యాయుల నిబద్ధత

ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు బ్లాక్‌బోర్డు మాత్రమే కాదు, ప్రపంచాన్ని చూసే అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కష్టపడి చదివి ఐఐటీలు, మెడికల్, ఇంజినీరింగ్ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సాధిస్తున్నారని చెప్పారు. చేగుంట పాఠశాల నుంచే ఇద్దరు విద్యార్థులు ఐఐఐటీలో ప్రవేశం పొందడం ఉపాధ్యాయుల నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలని, డాక్టర్, ఐఏఎస్, ఇంజనీర్ లేదా ఇతర ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం కృషి చేయాలని సూచించారు. విజయవంతమైన వ్యక్తుల్లో కనిపించే ప్రధాన లక్షణం క్రమశిక్షణేనని, చదువుతో పాటు కష్టపడి పనిచేసే అలవాటు పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.

సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించడం ప్రతి ఒక్కరి బాధ్యత

ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన తరగతి గదులు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం, కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయడం అభినందనీయమన్నారు. విద్యాభివృద్ధికి సేవలందిస్తున్న సంకల్ప్ సంస్థను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటివరకు వేలాది మంది విద్యార్థులకు చదువుకునేందుకు సహాయం అందించడంతో పాటు, ఉన్నత విద్య కొనసాగించాలనుకునే విద్యార్థులకు అండగా నిలుస్తామని ప్రకటించడం గొప్ప సామాజిక బాధ్యతగా అభివర్ణించారు.

తన తండ్రి వెంకటస్వామి స్ఫూర్తితోనే సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావన అలవడిందని మంత్రి తెలిపారు. వ్యాపారంలో విజయం సాధించిన తర్వాత పెద్దపల్లి పార్లమెంట్ నియోజకర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఫర్నిచర్, ఇతర మౌలిక వసతులు కల్పించడం ప్రారంభించానని చెప్పారు. సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించడం దాతృత్వం కాదని, అది ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి కూడా నేటి కాలంలో అత్యంత కీలకమని మంత్రి పేర్కొన్నారు. కృత్రిమ మేధ విస్తరిస్తున్న నేపథ్యంలో సంప్రదాయ ఉద్యోగాల్లో మార్పులు వస్తున్నాయని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ అందిస్తోందన్నారు. TOMCOM ద్వారా విదేశీ భాషా శిక్షణతో పాటు దేశీయ, అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.

చేగుంటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుకు కృషి చేస్తా

చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులు చదువులో రాణించడమే కాకుండా తల్లిదండ్రులను గౌరవిస్తూ మంచి విలువలతో ఎదగాలని సూచించారు. చేగుంట ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, డిగ్రీ కళాశాల మంజూరుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఇంటర్మీడియట్ కళాశాల ప్రిన్సిపాల్, Sureify మేనేజింగ్ డైరెక్టర్, సంకల్ప్ సంస్థ ప్రతినిధులు, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, చేగుంట సర్పంచ్, ఉపసర్పంచ్, మార్కెట్ కమిటీ చైర్మన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

NTR డిగ్రీ కళాశాల అదనపు తరగతి గదులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha