ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేలా విద్యాశాఖ సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టబోతోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ స్కూళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత లెర్నింగ్ విధానాన్ని, అలాగే విద్యార్థులకు వ్యక్తిగతంగా డిజిటల్ బోధన అందించేందుకు 'ఏఐ ట్యూటర్లను' ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.
సచివాలయంలో నిర్వహించిన జిల్లా విద్యాశాఖాధికారులు (DEO), అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ల (APC) ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఈ సరికొత్త విధానం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును (Enrollment) కనీసం 10 శాతం మేర పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకోసం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Read Also : మంత్రి నారా లోకేష్‌ను కలిసిన స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ!

‘లీప్ యాప్’ ఆధారంగా డిజిటల్ బోధన.. విద్యార్థులకు ఆధునిక వసతులు
ఈ ఆధునిక విద్యా సంస్కరణలన్నింటినీ ‘లీప్ యాప్’ (Leap App) కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. పాఠశాల విద్యా వ్యవస్థలోని అన్ని స్థాయిల్లోనూ ఒకే విధమైన, ఖచ్చితమైన డేటా నిర్వహణ ఉండాలని ఆయన ఆదేశించారు. కేవలం చదువులకే పరిమితం కాకుండా విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ‘స్మార్ట్ కిచెన్లను’ (Smart Kitchens) అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అదేవిధంగా, డిజిటల్ యుగంలో విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్‌గా తీర్చిదిద్దేందుకు వీలుగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ‘క్రోమ్ బుక్స్’ (Chrome Books) పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. రాబోయే టెన్త్ క్లాస్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించడమే పరమావధిగా ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో కష్టపడాలని లోకేశ్ పిలుపునిచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

