Supreme Court: దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల అర్హతలపై సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) మరోసారి అత్యంత కీలకమైన స్పష్టతనిచ్చింది.
విద్యాహక్కు చట్టం (RTE) నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లందరూ నిర్దేశిత కాలపరిమితిలోగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) రాసి తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సిందేనని తేల్చిచెప్పింది. గతంలో తాము ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును సవాలు చేస్తూ పలు ఉపాధ్యాయ సంఘాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను కోర్టు పూర్తిగా కొట్టేసింది.
TETMandatory
అయితే, టీచర్ల భవిష్యత్తును, విద్యార్థుల విద్యావ్యాప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఒక చిన్న ఉపశమనం కల్పించింది. టెట్ పాస్ కావడానికి గతంలో ఇచ్చిన రెండేళ్ల గడువును ఇప్పుడు మూడేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Read also: Supreme Court: నీట్ లీక్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
2028 ఆగస్టు 31 వరకు డెడ్‌లైన్ పొడిగింపు
జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ సంచలన తీర్పును వెలువరించింది. ఈ తాజా సవరణ ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత సాధించడానికి ఇదివరకు ఉన్న 2027 ఆగస్టు 31 డెడ్‌లైన్‌ను ఇప్పుడు 2028 ఆగస్టు 31 వరకు పొడిగించారు. ఈ ఒక్క కాలపరిమితి మార్పు మినహా, గతంలో తాము ఇచ్చిన తీర్పులోని మిగతా అన్ని నిబంధనలు యథావిధిగా అమలులో ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది.
Supreme Court: 69 ఉపాధ్యాయ సంఘాల రివ్యూ పిటిషన్లు తిరస్కరణ
విద్యాహక్కు చట్టం అమలులోకి రాకముందు ఉద్యోగాల్లో చేరి.. ప్రస్తుతం రిటైర్మెంట్‌కు ఐదేళ్లకు పైగా సర్వీసు ఉన్న ఉపాధ్యాయులందరికీ టెట్ తప్పనిసరి చేస్తూ 2025 సెప్టెంబరు 1న సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. వారు తమ ఉద్యోగాల్లో కొనసాగాలన్నా లేదా ప్రమోషన్లు పొందాలన్నా రెండేళ్లలో టెట్ పాస్ కావాలని నాడు పేర్కొంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది.
దీనిపై స్పందిస్తూ దాదాపు 69 ఉపాధ్యాయ సంఘాలు గత ఏడాది అక్టోబరు 12న సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనం తాజాగా వాటిని తోసిపుచ్చుతూ తుది తీర్పునిచ్చింది. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చి 15 ఏళ్లు దాటిన తర్వాత కూడా పరీక్ష పాస్ కావడానికి తమకు తగినంత సమయం లేదని ఉపాధ్యాయులు చెప్పడం ఎంతమాత్రమూ సమర్థనీయం కాదని న్యాయమూర్తులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Read hindi news : hindi.vaartha.com
Read also Epaper : epaper.vaartha.com
read also:

