Matrimony Fraud: హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో సాగుతున్న మరో ఘరానా మోసం వెలుగుచూసింది. నల్గొండ జిల్లాకు చెందిన పనస మధు గౌడ్ అనే వ్యక్తి, మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో తనను తాను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) చర్లపల్లి విభాగంలో గ్రేడ్-3 టెక్నికల్ మేనేజర్‌గా పరిచయం చేసుకున్నాడు.
బాధితురాలి కుటుంబాన్ని నమ్మించేందుకు నకిలీ ఐడీ కార్డులను కూడా సృష్టించాడు. యువతి కుటుంబం ఆర్థికంగా స్థిరపడిన వారని తెలుసుకున్న నిందితుడు, భారీగా కట్నం ఆశించి కోటిన్నర రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం కూడా వైభవంగా జరిగింది.
Fake FCI arrested for demanding dowry of Rs. 1.5 crore!
Matrimony Fraud: ప్రీ-వెడ్డింగ్ షూట్ నెపంతో వేధింపులు
నిశ్చితార్థం తర్వాత నిందితుడు మధు ప్రీ-వెడ్డింగ్ షూట్ పేరుతో యువతిని చైతన్యపురిలోని ఒక గదికి పిలిపించి, ఆమెపై అనుమానంతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా వేధింపులకు గురిచేశాడు. అతని ప్రవర్తనతో భయపడిన యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. బాధితురాలి కుటుంబం వెంటనే అతను పనిచేస్తున్నట్లు చెప్పిన ఎఫ్.సి.ఐ కార్యాలయంలో ఆరా తీయగా, అక్కడ అటువంటి ఉద్యోగి ఎవరూ లేరని, అతను చూపించిన ఐడీ కార్డు నకిలీదని తేలిపోయింది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు చైతన్యపురి పోలీసులను ఆశ్రయించారు.
పోలీసుల అదుపులో కేటుగాడు
బాధితుల ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు ఆదివారం నిందితుడు పనస మధును అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి పేరుతో భారీగా సొమ్ము కాజేయాలని ప్లాన్ వేసిన ఈ కేటుగాడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల వినియోగదారులకు కీలక సూచనలు చేశారు. ఆన్‌లైన్ సంబంధాల విషయంలో గుడ్డిగా నమ్మకుండా, అవతలి వ్యక్తి నేపథ్యం, ఉద్యోగ వివరాలను క్షుణ్ణంగా విచారించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

