Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం.. నిందితుడు ప్రియుడే!

ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం.. నిందితుడు ప్రియుడే!

వార్త 2 months ago

మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై జరిగిన అత్యాచారం ఘటన ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

మహిళల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఆయన స్పష్టం చేశారు. తాజాగా ఈ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. సాంకేతిక ఆధారాల సాయంతో జరిపిన విచారణలో, బాధితురాలికి సన్నిహితుడైన శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు.బాధితురాలి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని చాటింగ్ వివరాలను విశ్లేషించారు. సీసీ ఫుటేజీలు, కాల్ రికార్డులను పరిశీలించి నిందితుడు రాజుపాలేనికి చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రహస్య ప్రదేశంలో విచారిస్తూ మరిన్ని వివరాలు రాబడుతున్నారు.

Read Also:Moinabad drugs case: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నేడే కీలక తీర్పు

పూర్తి స్థాయిలో విచారణ

అంతే కాకుండా దీనిలో సదరు ఉపాధ్యాయినితో రాజుపాలెంకు చెందిన శ్రీనివాస్ తో రిలేషన్ ఉందని గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా పలు విషయాల్ని వెల్లడించాడు. మరోవైపు మహిళ ప్రస్తుతం కోలుకుంటుందని, ఆమె చెప్పిన విషయాలతో యువకుడు చెప్పిన విషయాలపై ఆరా తీసి పూర్తి స్థాయిలో విచారిస్తామని పోలీసులు వెల్లడించారు.

ఇటీవల అతనికి మహిళపై అనుమానంతో గొడవకు దిగాడని, ఈ క్రమంలో అత్యంత ఘోరంగా దాడులు చేశాడని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.మహిళ చెప్పినట్లు 40 నుంచి 45 ఏళ్ల వయసులో ఎవరు ఆమె చెప్పిన సమయంలో అక్కడి నుంచి పోలేదని, కేవలం 30 ఏళ్ల యువకుడు మాత్రమే అక్కడి సమీపంలోని పలు సీసీ ఫుటేజీల్లో కన్పించాడు. దీంతో అతను మహిళపై దాడి చేశాడని పోలీసులు తెల్చారు. మరింత లోతుగా దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

అసలేం జరిగింది?

బాధితురాలు శుక్రవారం సాయంత్రం తన స్వగ్రామమైన సత్తెనపల్లికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి తలుపు తట్టడంతో ఆమె తలుపు తీశారు. వెంటనే లోపలికి ప్రవేశించిన నిందితుడు కత్తితో బెదిరించి భయాందోళనకు గురిచేశాడు. అనంతరం ఆమె చున్నీతోనే కాళ్లు, చేతులు కట్టేసి, నోరు నొక్కేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమెను తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

సాగర్ కాలువలో దూకి తల్లీకూతురు ఆత్మహత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha