Moinabad drugs case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మొయినాబాద్లోని రోహిత్ రెడ్డి ఫాం హౌస్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో అరెస్టయిన ముగ్గురు నిందితుల మూడవ దఫా కస్టడీ పిటిషన్ పై రాజేంద్రనగర్ కోర్టు తీర్పును బుధవారానికి వాయిదా వేసింది.
ఈ కేసులో అరెస్టయిన రోహిత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీ రియల్టర్ నమిత్ శర్మలు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది.
మొయినాబాద్ ఫాం హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులను మూడవసారి ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని చేవెళ్ల పోలీసులు కోరడం తెలిసిందే. అయితే డిఫెన్స్ న్యాయవాది దీనిని వ్యతిరేకించి తన క్లయింట్లకు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించడం విదితమే.

Moinabad Drugs Case: Key Verdict Today
Moinabad drugs case: నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన రాజేంద్రనగర్ కోర్టు
దీనిపై సోమవారమే వాదనలు ముగియగా మంగళవారం తీర్పు వెలువడాల్సి వుంది. అయితే మంగళవారం సాయంత్రం నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పును బుధవారానికి వాయిదా వేసిన కోర్టు ఇదే సమయంలో నిందితుల తరపున దాఖలైన బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఈ ముగ్గురు మూడు వారాలుగా చంచల్ గూడ జైల్లో రిమాండులో వున్నారు. ఫాం హౌస్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులను రెండు దఫాలు మూడేసి రోజుల పాటు పోలీసు విచారించడం తెలిసిందే. రెండు దఫాల విచారణలో ముగ్గురు పెద్దగా సమాచారం వెల్లడించక పోవడంతో మూడదఫా కస్టడీ విచారణకు పోలీసులు కోర్టును ఆశ్రయించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

