Pedda Shankarampet News: ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో నిబద్ధత, బాధ్యతతో పనిచేయాలని ఎంపీడీవో క్రాంతికుమార్ అన్నారు.
సాధారణ బదిలీలలో భాగంగా మండలం నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్తున్న మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులకు శుక్రవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో క్రాంతి కుమార్ మాట్లాడుతూ, మండల అభివృద్ధికి పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది చేసిన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో వారు చూపిన కృషిని గుర్తుచేస్తూ వారికి శాలువాలతో ఘనంగా సన్మానించారు.
Pedda Shankarampet News: అదే సమయంలో మండలానికి నూతనంగా వచ్చిన పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బందికి స్వాగతం పలికారు. కొత్త బాధ్యతలు చేపట్టిన అధికారులు ప్రజలకు మరింత చేరువై ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపరిoడెంట్ షాకీర్ ఆలీ, ఎంపీఓ జాకీర్ హుస్సేన్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొని బదిలీపై వెళ్తున్న అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా వచ్చిన అధికారులను ఆత్మీయంగా ఆహ్వానించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

