Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైతుల సమస్యలపై స్పందించిన ఎస్పీ

రైతుల సమస్యలపై స్పందించిన ఎస్పీ

వార్త 1 week ago

Medak Paddy Procurement: మెదక్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కరించేందుకు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు శుక్రవారం మెదక్ లోని దయరా పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్నకుమార్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ సందీప్‌రెడ్డి, ఎస్ఐ నారాయణతో కలిసి కేంద్రంలోని పరిస్థితులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించేందుకు సరిపడా లారీలు అందుబాటులో లేక కొనుగోలు ప్రక్రియ ఆలస్యమవుతోందని రైతులు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు బ్లాక్ టార్పాలిన్లు అవసరమని కోరారు.

Read Also : Telangana Doctors Strike:నిలిచిపోయిన ఓపీ సేవలు..జీవో 38 బదిలీల వివాదంతో రోడ్డుపైకి వచ్చిన ప్రభుత్వ వైద్యులు!

 SP responds to farmers’ problems

Medak Paddy Procurement: అదనపు కలెక్టర్‌తో మాట్లాడిన ఎస్పీ

దీనిపై వెంటనే స్పందించిన ఎస్పీ, జిల్లా అదనపు కలెక్టర్ నగేష్‌తో ఫోన్‌లో మాట్లాడి రైతులకు అవసరమైన టార్పాలిన్లు, ఇతర సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనికి స్పందించిన అదనపు కలెక్టర్ తక్షణమే అవసరమైన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం రవాణాకు అవసరమైన లారీల కొరతపై కూడా ఎస్పీ స్పందించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని రైతులకు లారీలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని డీఎస్పీ ప్రసన్నకుమార్‌ను ఆదేశించారు.

రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతుల సంక్షేమానికి జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ సహకారం అందిస్తారని, రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగంతో కలిసి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం.. పచ్చదనం పెంచుదాం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha