Dailyhunt
ప్రభుత్వం మారినా మారని ఉద్యోగుల, ఉపాధ్యాయుల బ్రతుకులు

ప్రభుత్వం మారినా మారని ఉద్యోగుల, ఉపాధ్యాయుల బ్రతుకులు

వార్త 3 weeks ago

APTF: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ శింగనమల మండల శాఖ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అవుతోంది అయినా ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాలు జీవితాల్లో మార్పు మాత్రం శూన్యంగా కనిపిస్తోంది.

డి ఏ లు లేవు, ఐ ఆర్ లేదు, పి ఆర్ సి నియామకం కుడా లేదని, ఉపాధ్యాయ సంఘాలుగా ప్రశ్నించిన నిరసన ధర్నాలు చేసిన ప్రభుత్వంలో కదలిక లేదు పైపెచ్చు ఒకటవ తేదీ జీతం ఇస్తున్నాము కదా అన్న ప్రభుత్వ పెద్దల మాటలు గత పాలకుడి విధానాలనే సుతిమెత్తగా అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Read Also: Andhra Pradesh: తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై చంద్రబాబు కీలక ప్రకటన

ఇదే కొనసాగితే ఇప్పటికే 12వ పి.ఆర్.సి మూడు సంవత్సరాలు ఆలస్యమైంది. అసలు పాలకులు చెప్తున్నా సంక్షేమ ప్రభుత్వంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నారా లేదా అనే సందేహం వస్తుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చొరవ తీసుకొని ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలపై దృష్టి సారించాలి గత పది సంవత్సరాలుగా ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి పెండింగ్ సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్ ప్రకటించాలి లేనిపక్షంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్తొ కలిసి వచ్చే సంఘాలతో మరింత తీవ్రమైనటువంటి ఉద్యమకారాచరణను రూపొందిస్తుందని తక్షణం ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాయినాథ్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు నారాయణరెడ్డి, మధుసూదన్, బాల నల్లప్ప, వెంకట్ రాముడు నాయక్ రామకృష్ణ, వరదప్ప, రామ మోహన్, ఉషారాణి, నాగ సుధా, రవి నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

పెండింగ్ బకాయిలు విడుదల..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha