Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై చంద్రబాబు కీలక ప్రకటన

తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై చంద్రబాబు కీలక ప్రకటన

వార్త 2 months ago

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థుల తల్లులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 'తల్లికి వందనం' పథకం నిధుల విడుదలను వచ్చే జూన్ నెలలోనే చేపడతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సంక్షేమ పథకాల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

వేసవి సెలవుల అనంతరం జూన్ నెలలో పాఠశాలలు, జూనియర్ కళాశాలలు పునఃప్రారంభమైన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000 ఆర్థిక సాయం అందుతుంది. ఇందులో స్కూల్ లేదా కాలేజీ నిర్వహణ నిధి కోసం రూ.2,000 మినహాయించి, మిగిలిన రూ.13,000 నేరుగా తల్లి ఖాతాలోకి చేరుతాయి. ఒకవేళ తల్లి లేని పక్షంలో తండ్రి లేదా సంరక్షకుడి ఖాతాకు ఈ నిధులు బదిలీ చేస్తారు.

Read Also: Nara Lokesh Meets PM Modi: అమరావతి బిల్లు ఆమోదం.. ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్

 Chandrababu Naidu’s key statement on the release of funds for the Mother’s Vandanam scheme

Andhra Pradesh: సంక్షేమ పథకాల వెల్లువ: ఉచిత సిలిండర్లు, విద్యుత్

రాష్ట్రంలో అమలవుతున్న ఇతర పథకాల గురించి కూడా సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు.దీపం 2.0 పథకం కింద మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇంటింటికీ పైపుల ద్వారా గ్యాస్ అందిస్తామని, దీనిపై ఏడాదికి రూ.2,400 సబ్సిడీ ఇస్తామని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి చేనేత కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి వచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న స్త్రీశక్తి పథకం సూపర్ హిట్ అయిందని సీఎం పేర్కొన్నారు.

పథకం అర్హతలు, ముఖ్య గమనికలు

తల్లికి వందనం పథకం లబ్ధి పొందాలంటే విద్యార్థులు, తల్లిదండ్రులు కొన్ని నిబంధనలు పాటించాలి:

  1. విద్యార్థులు: ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నవారు అర్హులు.
  2. హాజరు: విద్యార్థికి కనీసం 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి.
  3. NPCI లింకింగ్: ఇది అత్యంత ముఖ్యం. తల్లి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఆధార్‌తో అనుసంధానించబడి (NPCI mapping) ఉండాలి.
  4. తల్లికి వందనం పథకానికి సంబంధించి విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్‌తో అనుసంధానించడం (NPCI లింకింగ్) తప్పనిసరి అనే విషయాన్ని మర్చిపోకూడదు. బ్యాంకులో కానీ, నెట్ బ్యాకింగ్, మొబైల్ యాప్, మీ సేవా కేంద్రాల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

నెల్లూరులో పెన్షన్ల పండుగ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha