PM Modi Telangana Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది.
శనివారం జాతీయ రహదారుల విభాగం రీజినల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఆదివారం (మే 10) హైదరాబాద్‌లో ప్రధాని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
Read Also:TamilNadu Politics: ప్రకాశ్ రాజ్ 'సెల్యూట్' ఎవరికో తెలుసా?
హెచ్‌ఐసీసీ వేదికగా అభివృద్ధి పనుల జాతర
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ (HICC) వేదికగా ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రాష్ట్ర పారిశ్రామిక, రవాణా రంగాల్లో ఈ ప్రాజెక్టులు కీలక మార్పులు తీసుకురానున్నాయి.
ప్రధానంగా ఈ క్రింది ప్రాజెక్టులపై దృష్టి సారించనున్నారు:
- కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్: వరంగల్‌లోని ఈ భారీ ప్రాజెక్టు ప్రారంభోత్సవం.
- హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్: గూడెబల్లూరు – మహబూబ్‌నగర్ నాలుగు వరుసల రహదారికి శంకుస్థాపన.
- రైల్వే ప్రాజెక్టులు: కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే పనుల ప్రారంభం.
HICC PM Modi Event
PM Modi Telangana Visit: మారిన రాజకీయ వాతావరణం.. ప్రోటోకాల్ పాటింపు
గత ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి పర్యటనల సమయంలో తరచూ ప్రోటోకాల్ వివాదాలు తలెత్తేవి. అయితే, ప్రస్తుత రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే సంప్రదాయాన్ని గౌరవిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయంలో ప్రధానికి స్వయంగా స్వాగతం పలికే అవకాశం ఉంది. అనంతరం హెచ్‌ఐసీసీలో జరిగే అధికారిక కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారని సమాచారం.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

