TamilNadu Politics: తమిళనాడులో వారం రోజులుగా సాగుతున్న రాజకీయ సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ కొద్దిసేపటి క్రితమే రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌తో భేటీ అయ్యారు.
తన కూటమికి మద్దతిస్తున్న పార్టీల లేఖలను గవర్నర్‌కు సమర్పించి, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవలసిందిగా కోరారు. విజయ్ విజ్ఞప్తికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఆదివారం ఉదయం ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారైంది.
Read Also:PM Modi-Pawan Kalyan: రేపు పవన్ నివాసానికి ప్రధాని మోదీ?
ప్రతిపక్షంగా పోరాడుతాం: ఎంకే స్టాలిన్
విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిన నేపథ్యంలో డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూనే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. “ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమికి ఆశించిన మెజారిటీ రాకపోయినా, ప్రజల నుంచి గణనీయమైన ఓట్లు సాధించాం. మేము కొత్త ప్రభుత్వానికి అడ్డుపడబోం, కానీ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడుతాం” అని స్టాలిన్ స్పష్టం చేశారు.
స్టాలిన్ నిర్ణయానికి ప్రకాశ్ రాజ్ ‘సెల్యూట్’
ఎంకే స్టాలిన్ చేసిన ఈ ట్వీట్‌కు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. స్టాలిన్ చూపిన ప్రజాస్వామ్య స్ఫూర్తిని అభినందిస్తూ “సెల్యూట్” అని ప్రకాశ్ రాజ్ పోస్ట్ చేశారు. ఓటమిని హుందాగా స్వీకరించి, ప్రతిపక్ష పాత్రకు సిద్ధమైన స్టాలిన్ తీరును నెటిజన్లు కూడా ప్రశంసిస్తున్నారు. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతుండటంతో అటు అభిమానుల్లో సందడి, ఇటు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
రేపే దళపతి పట్టాభిషేకం.. వైరల్ అవుతున్నగవర్నర్ నోట్!

