Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రధాని నివాసానికి అరవింద్ కేజ్రీవాల్ పాదయాత్ర

ప్రధాని నివాసానికి అరవింద్ కేజ్రీవాల్ పాదయాత్ర

వార్త 4 days ago

Arvind Kejriwal: ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ20 (E20) పెట్రోల్ వినియోగానికి వ్యతిరేకంగా తమ నిరసనను మరింత ఉధృతం చేశారు.

ఈ క్రమంలో మంగళవారం (ఆగస్టు 4) ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి పాదయాత్రగా వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఈ పాదయాత్ర ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మందికి పైగా సంతకాలు చేసిన వినతిపత్రాలను ప్రధానికి నేరుగా అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

Read Also :Brij Bhushan: లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నిర్దోషిగా విడుదల

కేజ్రీవాల్ ప్రసంగంలోని ప్రధాన ముఖ్యాంశాలు & ఆరోపణలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి, అక్కడి నుంచి ఇథనాల్ కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం E20 పెట్రోల్ విధానాన్ని బలవంతంగా రుద్దుతోందని కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఏ విధమైన అణచివేతలకు బెదిరిపోని 100 మంది ప్రతినిధులతో కలిసి తాను ప్రధాని నివాసం వైపు ప్రశాంతంగా పాదయాత్ర చేపడతానని స్పష్టం చేశారు.

Arvind Kejriwal: ఆమ్‌ ఆద్మీ పార్టీ డిమాండ్లు

  1. శుద్ధమైన పెట్రోల్ ఆప్షన్: ప్రతి పెట్రోల్ బంకు వద్ద E20 పెట్రోల్‌తో పాటు సాధారణ (Pure) పెట్రోల్‌ను ఎంచుకునే వెసులుబాటును వాహనదారులకు కల్పించాలి.
  2. ధరల తగ్గింపు: E20 పెట్రోల్ తయారీ ఖర్చు తక్కువ కాబట్టి దాని ధరను సాధారణ పెట్రోల్ కంటే తగ్గించాలి మరియు లీటర్ పెట్రోల్ ధరను రూ.84 కంటే తక్కువకు తీసుకురావాలి.
  3. శాస్త్రీయ అధ్యయనం: E20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజిన్ దెబ్బతింటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న ఇంజనీరింగ్ డేటా లేదా నివేదికలను బహిర్గతం చేయాలి.

పదవీచ్యుతి తర్వాత తొలిసారిగా బహిరంగంగా కనిపించనున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha