Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నిర్దోషిగా విడుదల

లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నిర్దోషిగా విడుదల

వార్త 4 days ago

Brij Bhushan: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు, బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ (Brij Bhushan Sharan Singh) కు రౌస్ అవెన్యూ కోర్టులో భారీ ఊరట లభించింది.

ఈ కేసులో బ్రిజ్ భూషణ్‌తో పాటు మరో నిందితుడు వినోద్ తోమర్‌పై వచ్చిన ఆరోపణలను కొట్టివేస్తూ, వారిద్దరినీ నిర్దోషులుగా తేలుస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు (అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అశ్విని పన్వార్) ఈ రోజు తీర్పు వెలువరించింది. దీంతో రెండేళ్లకు పైగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ కేసుకు తెరపడింది.

Read Also :Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్.. నెక్స్ట్ ఏంటి?

“ఆరోపణలు రుజువైతే ఉరి వేసుకుంటానన్నా.. అదే నిజమైంది”

కోర్టు తీర్పు వెలువడిన వెంటనే బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ ‘ఎన్డీటీవీ’ (NDTV) తో మాట్లాడారు.”నాపై ఆరోపణలు వచ్చిన మొదటి రోజే చెప్పాను.. నాపై మోపిన నిందలు నిజమని రుజువైతే ఉరి వేసుకుంటానని. ఈ రోజు న్యాయస్థానం నన్ను గౌరవప్రదంగా నిర్దోషిగా తేల్చింది. నాపై జరిగినది కుట్ర అని మొదటి నుంచీ చెబుతున్నాను. జరిగిందేదో జరిగిపోయింది” అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Brij Bhushan: కేసు నేపథ్యం

WFI చీఫ్‌గా ఉన్న సమయంలో స్వదేశీ, విదేశీ మహిళా రెజ్లర్ల పట్ల బ్రిజ్ భూషణ్ అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఒలింపియన్లు వినేష్ ఫొగాట్, సాక్షి మాలిక్, బజ్‌రంగ్ పునియా తదితర ప్రముఖ రెజ్లర్లు 2023లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నెలల తరబడి భారీ నిరసనలు చేపట్టారు. ఈ నిరసనల అనంతరం ఢిల్లీ పోలీసులు FIR నమోదు చేసి దర్యాప్తు జరిపారు. 2023 జూన్ 15న సుమారు 1,500 పేజీల ఛార్జ్‌షీట్‌ను కోర్టులో సమర్పించారు. IPC సెక్షన్లు 354, 354A, 354D, 506(1) కింద నమోదైన ఆరోపణలపై కోర్టు సుదీర్ఘంగా విచారణ చేపట్టి, చివరికి ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాక ఈ రకమైన తుది తీర్పును వెలువరించింది.

కావేరి జలాల వివాదం.. సీఎం విజయ్ ముందున్న తొలి రాజకీయ సవాల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha