Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

వార్త 4 days ago

AP Colleges: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విద్యా విధానాల పరంగా భారీ ఊరట కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలలో కొత్తగా అదనపు కోర్సులను ప్రారంభించేందుకు ఇప్పటివరకు ఉన్న అత్యంత ఖరీదైన రూ.15 లక్షల కార్పస్ ఫండ్ (Corpus Fund) నిబంధనను పూర్తిగా రద్దు చేస్తూ ఉన్నత విద్యాశాఖ (Higher Education Department) కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

దీనివల్ల కాలేజీలపై భారీగా ఆర్థిక భారం తగ్గనుంది.

Read also:TG EAPCET 2026 Counselling :తెలంగాణ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల!

కొత్త కాలేజీలకు మినహాయింపు లేదు - రూల్స్ ఇవే

AP Govt Big Relief to Private Degree & PG Colleges: Rs 15 Lakh Corpus Fund Scrapped For New Courses

ప్రభుత్వం ప్రకటించిన ఈ భారీ వెసులుబాటు అన్ని కాలేజీలకూ ఒకేలా వర్తించదు.

  • ఇప్పటికే ఉన్న కాలేజీలకే ఛాన్స్: కార్పస్ ఫండ్ రద్దు నిర్ణయం కేవలం ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్న ప్రైవేట్ కాలేజీలకు మాత్రమే వర్తిస్తుంది. వారు తమ కాలేజీలలో కొత్త కోర్సులు పెట్టాలనుకుంటే ఈ ఫండ్ కట్టక్కర్లేదు.
  • నూతన కాలేజీలకు తప్పనిసరి: ఒకవేళ ఎవరైనా రాష్ట్రంలో కొత్తగా ఒక ప్రైవేట్ డిగ్రీ లేదా పీజీ కాలేజీని స్థాపించాలనుకుంటే మాత్రం, పాత నిబంధనల ప్రకారమే రూ. 15 లక్షల కార్పస్ ఫండ్‌ను ప్రభుత్వానికి తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది.

ఏరియాల వారీగా కొత్త ఫీజుల విధానం

కార్పస్ ఫండ్ రద్దు చేసినప్పటికీ, కొత్త కోర్సుల అనుమతి (Appproval) కోసం ప్రాంతాల వారీగా ప్రభుత్వం ప్రత్యేక ఫీజుల స్ట్రక్చర్‌ను ప్రవేశపెట్టింది.

ఉదాహరణకు: బీఏ (B.A) కోర్సు అనుమతి ఫీజు వివరాలు

  • గిరిజన ప్రాంతాలు (Tribal Areas): రూ. 30,000
  • గ్రామీణ ప్రాంతాలు (Rural Areas): రూ. 40,000
  • పట్టణ ప్రాంతాలు (Urban Areas): రూ. 50,000(గమనిక: బీఎస్సీ, బీకాం వంటి ఇతర ప్రొఫెషనల్ కోర్సులకు వేర్వేరు ఫీజుల నిబంధనలు వర్తిస్తాయి).

AP Colleges: కఠిన మార్గదర్శకాలు - ఏఐ (AI) తో కాలేజీల తనిఖీ

ఫీజుల పరంగా ఊరటనిచ్చిన ప్రభుత్వం.. కాలేజీల నిర్వహణ, పారదర్శకత విషయంలో మాత్రం నిబంధనలను మరింత కఠినతరం చేసింది.

  • 30 ఏళ్ల లీజు అగ్రిమెంట్: ప్రైవేట్ కాలేజీలను సొంత భవనాల్లో కాకుండా అద్దె భవనాల్లో నిర్వహిస్తుంటే.. సదరు యాజమాన్యాలు తప్పనిసరిగా 30 ఏళ్ల లీజు ఒప్పంద పత్రాన్ని కలిగి ఉండాలి. అలాగే ప్రతి ఏటా అనుమతిని రెన్యువల్ చేసుకోవాలి. ఒకవేళ లీజు 30 ఏళ్ల కంటే ఎక్కువ ఉంటే దానిని సొంత భవనంగానే ప్రభుత్వం పరిగణిస్తుంది.
  • వెబ్‌సైట్ అప్‌డేట్ తప్పనిసరి: ప్రతి కాలేజీ తమ అధికారిక వెబ్‌సైట్‌ను నిర్వహించాలి. ప్రతి ఏటా సెప్టెంబర్ 30 లోగా గత మూడేళ్లలో మంజూరైన సీట్లు, విద్యార్థుల ప్రవేశాలు, ఉత్తీర్ణత శాతం (Pass Percentage) మరియు అధ్యాపకుల విద్యార్హతల పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలి.
  • డేటా అనలిటిక్స్ & ఏఐ టెక్నాలజీ: కాలేజీల తనిఖీలు (Inspections), మౌలిక వసతుల పరిశీలన కోసం ఉన్నత విద్యాశాఖ ఇకపై డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించనుంది.
  • లక్ష జరిమానా - క్రిమినల్ కేసులు: అనుమతుల కోసం ఎవరైనా నకిలీ ధ్రువపత్రాలు (Fake Certificates) సమర్పించినా లేదా తప్పుడు సమాచారం ఇచ్చినా రూ. 1 లక్ష జరిమానా విధించడంతో పాటు యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. వరుసగా ఆరేళ్లపాటు ఎలాంటి విద్యా కార్యకలాపాలు నిర్వహించని కాలేజీల లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేస్తారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

ఈ ఏడాది కూడా ప్రైవేట్ స్కూల్ ఫీజుల మోత తప్పదా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha