Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణపై తెలంగాణ సర్కార్ ఫోకస్

ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణపై తెలంగాణ సర్కార్ ఫోకస్

వార్త 2 weeks ago

Telangana Private School : తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఇష్టారాజ్యంగా పెరుగుతున్న ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగింది.

మధ్యతరగతి, పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు (Fee Regulation) తక్షణమే సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ నిబంధనల అమలులో ఎక్కడా, ఎవరితోనూ రాజీపడొద్దని, రూల్స్ అతిక్రమించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునేలా మార్గదర్శకాలు ఉండాలని స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో, వీలైనంత త్వరగా అంటే ఈ నెలలోనే ఈ సరికొత్త ఫీజు నియంత్రణ చట్టాన్ని లేదా జీవోను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది.

Read Also : రేవంత్ ఆ పని చేస్తే రాజకీయం వదిలేస్తా..కేటీఆర్ సంచలన ప్రకటన

మౌలిక వసతుల ఆధారంగా 3 కేటగిరీలు.. గరిష్ఠ ఫీజుల పరిమితి ఖరారుకు కసరత్తు

ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను శాస్త్రీయంగా నియంత్రించేందుకు ప్రభుత్వం ఒక వినూత్న విధానాన్ని పరిశీలిస్తోంది. విద్యాసంస్థల్లో అందుబాటులో ఉన్న వసతులు, ల్యాబ్స్, ప్లే గ్రౌండ్ వంటి మౌలిక సదుపాయాల (Infrastructure) ఆధారంగా స్కూళ్లను మొత్తం మూడు కేటగిరీలుగా (3 Categories) విభజించాలని యోచిస్తోంది. ఏ కేటగిరీకి చెందిన స్కూల్ ఎంత మేర ఫీజు వసూలు చేయాలనే దానికి సంబంధించి ఒక గరిష్ఠ ఫీజు పరిమితిని (Maximum Fee Cap) ప్రభుత్వం ఖరారు చేయనుంది. దీనివల్ల స్టార్ హోటళ్లను తలపించేలా కార్పొరేట్ స్కూళ్లు వసూలు చేసే అడ్డగోలు ఫీజులకు బ్రేక్ పడనుంది. ప్రభుత్వ పరిమితికి మించి ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా గుర్తింపు రద్దు చేసేలా చట్టాన్ని బలోపేతం చేయనున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మీనాక్షి నటరాజన్‌పై తప్పుడు కేసులు పెట్టించింది రేవంత్ రెడ్డే: కేటీఆర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha