Telangana: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పైమండల స్థాయిలో స్థానిక రైతు వేదికలో గురువారం నాడు సమీపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో క్రాంతికుమార్, తహసిల్దార్ ప్రభు దాసులు ప్రభుత్వ పథకాల అమలు పై ఈ సమావేశంలో సమీక్షించారు.
గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుక వస్తే తద్వారా సమస్య పరిష్కారమయ్యే వీలుందన్నారు. ఆయా శాఖల అధికారులు తమ పరిధిలోని సంక్షేమ పథకాల అమలుపై క్షుణ్ణంగా వివరించారు. అనంతరం ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి ఈ సమావేశంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అదేవిధంగా మే నెల రెండవ తేదీన నియోజకవర్గ స్థాయిలో, మే 22న జిల్లా స్థాయిలో, జూన్ రెండవ తేదీన రాష్ట్రస్థాయిలో సమీక్ష సమావేశాలు ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశ ఆవరణంలో ఇందిర మహిళా శక్తి క్యాంటీను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏవో నాగం కృష్ణ, వైద్యాధికారి షరీఫోద్దీన్, ఎంఈఓ శేఖర్, సూపరిండెంట్ షాకిర్ అలీ, ఆర్ఐ రమేష్ ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
Telangana: Review of Public Governance Progress Plan
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

