రక్షణ, పౌర విమానయానం, ప్రభుత్వం ఉమ్మడి కసరత్తు
Adilabad Airport Survey: ఆదిలాబాద్ విమానశ్రయం దీర్ఘకాలిక డిమాండ్ కార్యరూపం దాల్చే క్షణాలు దాదాపు సమీపిస్తున్నాయి.
రక్షణ, పౌర విమానయాన శాఖలు, రాష్ట్రప్రభుత్వం ఉమ్మడిగా శుక్రవారం నుంచి క్షితిజ సమాంతర ఆటంక పరిమితి సర్వేను (అబ్డికల్ లిమిటెడ్ సర్వే) చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నాయి. పౌరవిమానయానశాఖ కు చెందిన సాంకేతిక నిపుణులు ముందుగా పెగ్మార్కింగ్ చేయబోతున్నారు. ఏడు నుంచి ఎనిమిది రోజుల వరకు సాంకేతిక నిపుణులు ప్రతిపాదిత విమానశ్రయం ప్రాంతంలో సర్వేచేయబతోన్నారు. విమాశ్రయ ప్రాతంలో క్షితజ సమాంతర ఉపరిత ఆటంక పరిమితులు ఉంటే ఎలా ఉన్నాయి లేకపోతే సాఫిగా ఎలా ఉందో తెలియజేస్తు నివేదిక ఇవ్వడానికి సుమారు రెండు నెలల సమయం తీసుకొంటారు.
Read Also: RRR Land Acquisition: త్రిపులార్ భూసేకరణ వేగవంతానికి రూ.527 కోట్లు చెల్లింపు
Adilabad airport obstacle limitation survey starts april 17
Adilabad Airport Survey: భూసేకరణ, నిర్వహణపై నిర్ణయం
ఆదిలాబాద్ విమానశ్రయంను 820 ఎకరాలలో నిర్మించేందుకు రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ నివాసంలో గత బుధవారం కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, కె. రాంమోహన్ నాయుడు నలుగురు మంత్రులు సమావేశమై సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చారు. రక్షణ శాఖకు చెందిన 370 ఎకరాలభూమి ఉన్నప్పటికి మిగితా 450 ఎకరాల భూమిని సేకరించే బాధ్యత రాష్ట్రప్రభుత్వానికి అప్పగించారు. ఎయిర్పోర్టు అథారిటీ ఇండియా, రక్షణశాఖ ఉమ్మడిగా ఈ విమా నశ్రయాన్ని నిర్వహించడానికి పరస్పరం అంగీకారానికి వచ్చాయి. ఇండియన్ ఏయిర్ ఫోర్స్ శిక్షణా కార్యక్రమాలకు ఈ విమానశ్రయం వాడు కోబోతుంది. తెలంగాణలో హైదరాబాద్ మినహా ఎక్కడ కూడా విమానా శ్రయాలు లేవు. దీనితో వరంగల్, ఆదిలాబాద్, జాక్రన్ పల్లి, బసంత్ నగర్లో విమానశ్రయాలు ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ పెరిగిపోతున్నది.
సర్వే ప్రాధాన్యత, భద్రతా అంశాలు
రక్షణ శాఖ, పౌర విమాన శాఖ, రాష్ట్రప్రభుత్వం ఉమ్మడిగా ప్రతిపాదిత విమానశ్రయంలో ఆటంక పరిమితి సర్వేను చేపట్టి ల్యాండింగ్, టేకాఫ్ వంటి విమాన కార్యకలాపాల భద్రత, సామర్థ్య నిర్ధారణను అధ్యయనం చేస్తారు. విమానశ్రయం సమీపంలో భవనాలు, పర్యావరణ వంటి సున్నిత విమానం ఢికొనేందుకు వీలుగా ఉన్నాయా అనే అంశంపై కూడా నిపుణులు అధ్యయనం చేయబోతున్నారు. విమానాలు పొరపాటున రద్దీగా ఉండే ప్రాంతాల్లో దిగకుండా, బయలుదేరేప్పుడు ఢీకొనకుండా విమాశ్రయం చుట్టు రక్షణకవచంగా వెలుపలి పరిధి నుంచి పైకి బయటకు విస్తరించి ఒక శంఖాకార ఉపరితలం ఉంటుంది. విమానాలు ప్రమా దం బారిన వడకుండా సురక్షితంగా నడిపించే సంభావ్యతను కలిగి ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు.. మధ్యాహ్న భోజనం కూడా!

