Telangana: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా ఉమ్మడి పుల్కల్ మండల పరిధిలో గ్రామసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామాల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై గ్రామసభల్లో విస్తృతంగా చర్చించారు ప్రజలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారుఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.
Read Also : Telangana budget 2026: రాష్ట్ర ఖజానాకు నిధుల సవాల్
Telangana: Gram Sabhas begin under the Public Governance-Progress Plan
విద్యుత్, విద్య, వైద్య సదుపాయాలు
గ్రామసభల్లో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, విద్య, వైద్య సదుపాయాలు, పింఛన్లు, గృహాల నిర్మాణం వంటి కీలక సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా గ్రామాల్లో మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామస్తులు కోరారు. పల్లెల అభివృద్ధికి అవసరమైన ప్రాధాన్యతా పనులను గుర్తించి వెంటనే అమలు చేయాలని ప్రజలు కోరారు

ప్రతి పథకం లబ్ధిదారులకు చేరేలా చర్యలు
అధికారులు మాట్లాడుతూ ప్రజల సమస్యలను నమోదు చేసి సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, ప్రతి పథకం లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గ్రామస్థులు కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక గ్రామసభల ద్వారా ప్రజల అవసరాలు నేరుగా తెలుసుకుని అభివృద్ధి పనులను వేగవంతం చేయడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సువర్ణ మండల విద్యాధికారిని అనురాధ బస్తి దవఖాన డాక్టర్ హరిహరన్ చౌట్కూర్ సర్పంచ్ పార్కల రాంరెడ్డి పంచాయతీ కారమండల ఉపాధ్యక్షులు రామా గౌడ్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు వర్కల రమేష్ అంగన్వాడి కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :
తెలంగాణ ఎక్సైజ్ శాఖ సరికొత్త రికార్డు: రూ. 44,557 కోట్ల ఆదాయం!

