Dailyhunt
రాష్ట్ర ఖజానాకు నిధుల సవాల్

రాష్ట్ర ఖజానాకు నిధుల సవాల్

వార్త 2 weeks ago

Telangana budget 2026: కొత్త 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నిధులు పెద్ద సవాల్ కానున్నాయి. అప్పులను సమకూర్చుకునే విషయంలో ఈ ఏడాది ఎఫ్ర్్బఎంలో ఇఒకింత ఆంక్షలు సదలించినా కేంద్ర ఆంక్షలు, గ్రాంట్లలో కోత వంటి వాటి ప్రభావం రాష్ట్ర ఆర్ధిక ప్రణాళికపై చూపించనుంది.

ఆసలే ఆదాయ, వ్యయాలు మధ్య వ్యత్యాసం భారీగా ఉండటంతో ఖజానా లోటుతో కొట్టుమిట్టాడుతోంది. ఇచ్చిన హామీల అమలు తప్పనిసరి కావడంతో అందుకు అవసరమైన నిధుల సమీకరణపై ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

Read also: Medchal Doctor Suicide: భార్య వేధింపులు భరించలేక..డాక్టర్ ఆత్మహత్య

నెలవారీ ఆదాయం మరో రూ.5 వేల కోట్లు పెరిగితే తప్ప ఆర్థిక స్థితి మెరుగు పడేలా కనిపించడం లేదు. ఆఆర్థిక శాఖ లెక్కల ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం సగటున నెలకు రూ.18 వేల 500 కోట్ల ఆదాయం వస్తోంది. అయితే, తెచ్చిన అప్పుల కిస్తీలు, వడ్డీలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే ప్రతి నెలా ఇసగటు రూ.13 వేల కోట్లు ఖర్చవుతోంది. మిగిలిన రూ.5 వేల కోట్లతోనే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి తప్పడం లేదు.

 Telangana budget 2026: Funding challenge for the state treasury

పన్నుల ఆదాయంపైనే సర్కార్

ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్ 2026-27కు సంబంధించి పన్నుల ఆదాయంపైనే సర్కార్ ఆధారపడింది. మొత్తం ఇడ్జెట్లో పన్నుల ద్వారా ఆదాయం 56 శాతం మేర వస్తుందని అంచనా వేసింది. రాష్ట్ర ఖజానాకు మొత్తం రాబడి రూ.3,24,134 కోట్లుగా బడ్జెట్ అంచనాల్లో వెల్లడించింది. ఈ మొత్తంలో స్వంత పన్ను ఆదాయాల వాటా రూ.1,48,165.75 కోట్లు కాగా, కేంద్ర పన్నులలో రాష్ట్ర వాటాగా రూ.33,181.64 కోట్లుగా అంచనా వేసింది. ఈ రెండూ కలిసి మొత్తం పన్ను ఆదాయం రూ.1,81,347.39 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక శాఖ బడ్జెట్లో ప్రభుత్వం పన్నుల ద్వారా రూ.1.75 లక్షల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా కాగా రూ.1,63,490 కోట్ల మేర వచ్చాయి.

Telangana budget 2026: పన్ను ఆదాయాలు

2025 -26లో పన్నుల ద్వారా లక్ష ్యంగా పెట్టిన రూ.1.64 లక్షల కోట్లకు చివరికి రూ.1.40 లక్షల కోట్లు మాత్రమే సాదించగలిగింది. ఈ ధోరణి 2026-27 ఆర్ధిక సంవత్సరంలో కూడా కొనసాగుతుందని అంచనా వేస్తూ, కేంద్ర పన్నుల వాటాతో కలిపి మొత్తం పన్ను ఆదాయం రూ.1.81,347.39 కోట్లుగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రభుత్వ సగటు నెలవారీ ఖర్చు రూ.26.500 నుండి రూ.27,000 కోట్లు కాగా ఆదాయ వనరులలో పన్ను ఆదాయాలు (జీఎస్టీ, ఎక్సైజ్, ఆస్తి పన్ను, మోటారు వాహన పన్ను), పన్నుయేతర ఆదాయాలు, కేంద్ర
గ్రాంట్లు ఉన్నాయి. ఇవి నెలకు దాదాపు రూ.12 వేల కోట్లు వస్తున్నాయని అంచనా. ఈ నేపథ్యంలో బడ్జెట్ ఖర్చు కంటే వచ్చే ఆదాయం సగమే కావడంతో మిగిలిన నిధులను అధిగమించేందుకు ఆదాయ వనరులకు సంబంధించి పన్నుల పెంపు, మద్యం ఆదాయంపై ఆధారపడటం, భూముల అమ్మకం వంటి పలు నిర్దిష్ట మార్గాలపై 2026-27 బడ్జెట్లో దృష్టిసారించింది.

హామీలలో మహిళలకు నెలకు రూ.2,500

ఎన్నికల హామీలలో మహిళలకు నెలకు రూ.2,500, రూ.500 కి గ్యాస్ సిలిండర్, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతు భరోసా కింద రైతులు మరియు కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 ఉన్నాయి. ఇక 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇంటి స్థలం, ఇల్లు లేని వారికి 5 లక్షలు, యువ వికాసం, సామాజిక భద్రతా పెన్షన్, రైతు భరోసా, వరికి రూ.500 బోనస్ చెల్లించాల్సి ఉంది. అలాగే కాళేశ్వరం, పాలమూరు, సమ్మక సాగర్ తదితర ప్రాజెక్టులను కొంత వరకూ అయినా చేపట్టాల్సి ఉంటుంది. మరోపక్క పీఆర్సీతో పాటు, కొత్త ఉద్యోగుల రిక్రూట్మెంట్, పెండింగ్ డీఏలకు అదనపు నిధులు కావాలి. అందుకు అనుగుణంగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో నిధులను సమకూర్చు కోవడం సర్కార్కు కత్తి మీద సాము కానుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

మూడు నెలల్లో లక్ష గృహ ప్రవేశాలు.. ముహూర్తాలివే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha