రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపనేత పదవి నుంచి తొలగించడంపై ఎంపీ రాఘవ్ చడ్డా స్పందించారు. ఈ వ్యవహారంపై తాను మౌనంగా ఉన్నానంటే దాని ఉద్దేశం ఓడిపోయినట్టు కాదన్నారు.
ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని రాఘవ్ చడ్డా విడుదల చేశారు. పార్లమెంటులో తన గొంతు నొక్కేందుకు సొంత పార్టీయే ప్రయత్నించిందని మండిపడ్డారు. తనకు ఎప్పుడు అవకాశం లభించినా, ప్రజా సమస్యలనే ప్రస్తావించినట్లు చెప్పారు. ప్రజా సమస్యలను ఎత్తిచూపడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని ఆప్ నాయకత్వం, రాజ్యసభ సెక్రటరీని కోరుతూ లేఖ రాయటం తనను విస్మయానికి గురిచేసిందన్నారు. సామాన్యులకు మేలు చేసే ఎన్నో అంశాలను తాను లేవనెత్తానన్న రాఘవ్ చడ్డా, దానివల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన నష్టం ఏమిటని నిలదీశారు. తాను ప్రజల పక్షాన ఉంటానని, వారికోసం ఎంత దూరమైనా వెళ్తానని రాఘవ్ చడ్డా స్పష్టం చేశారు.
Read Also: Vijay TVK Nomination: అఫిడవిట్లలో కేసుల గోల్‌మాల్.. నామినేషన్ చెల్లుతుందా?
Raghav Chadha
Raghav Chadha: , ప్రజా సమస్యలను ఎత్తిచూపడం ఏమైనా నేరమా?
“పార్లమెంట్‌లో నాకు ఎప్పుడు మాట్లాడే అవకాశం లభించినా ప్రజా సమస్యలనే లేవనెత్తుతా. బహుశా నేను ప్రస్తావించే అంశాలను సభలో సాధారణంగా చర్చించరేమో. కానీ, ప్రజా సమస్యలను ఎత్తిచూపడం ఏమైనా నేరమా? నేనేమైనా తప్పు చేశానా? పార్లమెంట్‌లో నాకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని మా పార్టీ స్వయంగా రాజ్యసభ సెక్రటరీకి చెప్పింది. అందుకే ఈ రోజు నేను ఈ ప్రశ్నలు అడగాల్సి వచ్చింది. ఎయిర్‌పోర్టుల్లో ఆహార ధరలు, టోల్ ప్లాజా దోపిడీ, గిగ్ వర్కర్ల సమస్యలు, టెలికాం కంపెనీల రీఛార్జ్ విధానాల సమస్యలను లేవనెత్తితే అది ఆమ్ ఆద్మీ పార్టీకే ప్రయోజనం కదా. దీని వల్ల పార్టీకి ఏం నష్టం జరుగుతోంది? ఎందుకు నన్ను మాట్లాడకుండా అడ్డుకుంటున్నారు? ఇలాంటి చర్యలతో నా గళాన్ని మీరు అణచివేయగలరు. కాని, ఇది నా ఓటమి కాదు అని రాఘవ్ చడ్డా అన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

