Kerala ldf manifesto : కేరళలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఈ నేపథ్యంలో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.
ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ మేనిఫెస్టోను గురువారం ప్రకటించారు.
సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మహిళా సాధికారత వంటి అంశాలను ప్రధాన లక్ష్యాలుగా తీసుకుని ఈ మేనిఫెస్టో రూపొందించినట్లు తెలిపారు. కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్నాయి.
మేనిఫెస్టోలో ప్రధాన హామీలు
ఎల్డీఎఫ్ విడుదల చేసిన మేనిఫెస్టోలో పలు కీలక హామీలు ఉన్నాయి. మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు.
అలాగే సంక్షేమ పింఛన్‌ను నెలకు రూ.3 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఐదు లక్షల పేద కుటుంబాలను ప్రత్యేకంగా ఆదుకునే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వృద్ధులు, మంచాన పడిన రోగులకు మెరుగైన సంరక్షణ అందించే విధంగా ప్రత్యేక పథకాలు అమలు చేస్తామని పేర్కొన్నారు. చదువు పూర్తిచేసుకున్న విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూడా తెలిపారు.
యువత, మహిళల కోసం ప్రత్యేక పథకాలు
ఉద్యోగం లేని యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు 'బ్యాక్ టూ క్యాంపస్' అనే కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. మహిళలు ఉద్యోగాలు చేయడానికి సురక్షిత ప్రయాణం, శిశు సంరక్షణ సదుపాయాలు, నైపుణ్య శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అలాగే విద్యావంతులు ప్రారంభించే వ్యాపారాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని ఎల్డీఎఫ్ హామీ ఇచ్చింది.
Read Also:Medchal Doctor Suicide: భార్య వేధింపులు భరించలేక..డాక్టర్ ఆత్మహత్య
Kerala ldf manifestoవిపక్ష యూడీఎఫ్ హామీలు
ఇదిలా ఉండగా విపక్ష యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సంక్షేమ పింఛన్‌ను రూ.3 వేలుకు పెంపు, కళాశాల విద్యార్థినులకు నెలకు రూ.1000 సాయం వంటి హామీలను ప్రకటించింది. అదేవిధంగా ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని యూడీఎఫ్ మేనిఫెస్టోలో పేర్కొంది. కేరళలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఈ హామీలు రాజకీయ చర్చలకు దారితీస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

