Public opinion : ప్రజా జీవితాలను ప్రభావితం చేసే కీలక అంశాలపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం ప్రజలకు ఇస్తే అలాంటి సందర్భంలోనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుం దని చెప్పుకోవాలి.
ఈ మధ్యనే స్విట్జర్లాండ్ ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి ప్రపంచానికే ఆదర్శంగా నిలబడింది. అదేదో సాదాసీదా విషయం కాదు. ఒకవేళ ప్రజలు ఔనన్నా కాదన్నా దాని అమలుకు బోలెడంత తతంగముంది. స్విట్జర్లాండ్ దేశ జనాభాను పది మిలియన్ల కే పరిమితం చేయాలన్న ప్రతిపాదనను ప్రజలు తిరస్కరిం చారు. వలసలను నియంత్రించడం ద్వారా దేశంలోని గృహ సమస్య, రవాణా వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడి నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల రీత్యా ఈ ప్రతిపాదనపై రిఫరెండం నిర్వహించారు. ఎన్నో అంశా లలో ముడిపడి ఉన్న జనాభా నియంత్రణ విషయంలో స్విస్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారంటే వారి విజ్ఞతను మెచ్చుకోవాల్సిందే. వలసల నియంత్రణ, దేశీయ వనరుల పరిరక్షణ, మౌలిక సదుపాయాలపై పెరుగుతున్న ఒత్తిడి వంటి అంశాలపై ప్రభావితం చూపే ప్రతి పాదనను జనం గట్టిగా వ్యతిరేకించారు. 55 శాతం మంది వ్యతిరేకంగా 45 శాతం మంది అనుకూలంగా ఓటు వేశారు.
public opinion
public opinion : ప్రజాభిప్రాయం స్పష్టం
ఆర్ధికాభి వృద్ధికి అవసరమైన నిపుణత కలిగిన విదేశీ కార్మికులు, యూరోపియన్ యూనియన్ ఉన్న ఆర్థిక సంబంధాలు, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలను కూడా ప్రజలు పరిగణనలోకి తీసుకుని ఉంటారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్కు వలసలు ఆగిపోయినట్లు భావించలేము. గృహాల కొరత, పెరుగుతున్న జనాభా ఈ దేశంలో చర్చనీయాంశమే. వల నలపై సమతుల్య విధానాలు, పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి నిర్మాణాత్మక చర్యల ద్వారా పరిష్కారం సాధ్యమని స్విట్జర్లాండ్ ప్రభుత్వం ప్రజలకు సంకేతాలు పంపినట్లుయింది. తాజాగా రైట్ వింగ్ పార్టీ ఆధ్వర్యంలో ‘సస్టెయిన్ బిలిటీ ఇనీషియేటివ్ ఆధ్వర్యంలో రిఫరెండమ్ నిర్వహించారు. ప్రజాభిప్రాయం స్పష్టంగా ఉన్నందున సరిపోయింది. లేకుంటే స్విట్జర్లాండ్ ప్రభు త్వం బాగా ఆపసోపాలు పడాల్సి ఉండేది. 2050 నాటికి దేశ జనాభా కోటి మార్కులను దాటకుండా రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం స్విట్జర్లాండ్ జనాభా సుమారు 91 లక్షలుగా, జనాభా క్రమేపీ పెరుగుతుండే కొద్దీ వలన నిబంధనలు కుటుంబ పునరేకీకరణ వంటి అంశాల్లో నిబంధనలు కఠినతరం చేయాల్సి ఉంటుంది. కోటి జనాభాకు చేరితే యూరోపియన్ యూనియన్ తో ఉన్న ఆర్థిక స్వేచ్ఛా కదలికలను పునర్నిర్వచించుకోవాల్సి వస్తుంది. వలసల కారణంగా దేశంలో ఇళ్ల కొరత, రవాణా ఆరోగ్య సంరక్షణ, విద్య, పర్యావరణంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నందన్న జీవన ప్రమాణాలను కాపాడుకోవడ మూ ముఖ్యమే.
విదేశీ కార్మికులపైనే దేశం ఆధారపడింది
ఆది నుంచి స్విట్జర్లాండ్ ప్రభుత్వం, పార్లమెంట్, వాణిజ్యవర్గాలు జనాభా పరిమితి ప్రతిపాద నను వ్యతిరేకించాయి. ఈ మార్పులన్నీ దేశ ఆర్థికవ్యవస్థకు భారీ నష్టం చేకూరుస్తుందని, ఫార్మా, టెక్, ఫైనాన్స్ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులపైనే దేశం ఆధారపడి ఉంటుంది. ఒకరకంగా ‘స్విస్ ట్రెగ్జిట్కు దారితీయ వచ్చని వారి ఆందోళన, అభివృద్ధి, భద్రత, వలసలు, ఉపాధి వంటి సంక్లిష్ట అంశాలను భావో ద్వేగాలతో కాకుండా దీర్ఘ కాలిక జాతీయయోజనాల దృష్టి లో కోరినట్లయితే ప్రజలే మంచి తీర్పుఇవ్వగలరని, ప్రస్తుత పరిణామం తేటతెల్లం చేసింది. కొన్ని సవాళ్లను ప్రజాస్వామ్యయుత చర్చలద్వారా సమగ్రంగా పరిష్కరించుకోగలరని స్విస్ ప్రజలు సంకేతమి చ్చారు. ప్రజాస్వామ్యంలో చర్చ, వాదన, విభిన్న అభిప్రా యాలు తప్పవు. ప్రపంచంలోని అనేక దేశాల్లో వలసల అంశం రాజకీయంగా అత్యంత సున్నితమైనదిగానే పరిగ ణించాలి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ వంటి దేశాల్లో కూడా వలసలపై తీవ్రమైన ప్రభావితం జరుగుతోంది. భద్రత, ఉపాధి, సంస్కృతి, జాతీయ గుర్తింపు వంటి అంశాలతో ఈ చర్చలు ముడిపడి ఉంటాయి. వేటికైనా ప్రస్తుత పరిస్థితులలో విధాన నిర్ణయాల ద్వారానే సమస్య పరిష్కారం దొరుకుతుంది. ప్రజల్లో ప్రజాస్వామ్యంపై విశ్వా సం, రాజకీయ చైతన్యం, బాధ్యతాయుత నిర్ణయ సామర్థ్యం ఉన్న సందర్భాలలో దేశాలు మరింత బలపడతాయి.
public opinion
ప్రజలే నేరుగా తీర్పు చెప్పడం
స్విట్జర్లాండ్ అంటేనే ఓ విభిన్నత గోచరిస్తుంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎన్నికలతో ముగిసిపోదు. కీలక విధానాలు, రాజ్యాంగ సవరణలు, పన్నులు, పర్యావరణం, సామాజిక సంక్షేమం, వలసలు వంటి అన్ని అంశాలపై నిర్ణయాలన్నీ ప్రజలే నేరుగా తీర్పు చెప్పడం అలవాటుపడ్డారు. ప్రపంచ రాజకీయాల్లో వలసల సమస్య ఎక్కువగా ఉంది. స్విట్జర్లాండ్ జనాభా తక్కువ మందే అయినా అత్యంత అభివృద్ధి చెం దిన ఆర్ధిక వ్యవస్థలో ఒకటి. అందుచేతనే ఇలాంటి ఒత్తిడి తక్షణ మార్పును సూచించలేవు. నైపుణ్య ఆధారిత వలస విధానాన్ని అమలు అన్నిటికీ మేలు. స్విస్ ప్రజలు స్థానిక ప్రయోజనాలను కాపాడుకుంటూనే ప్రపంచీకరణ వలన కలిగిన ప్రయోజనాలను కూడా అంగీ కరించడం విశేషం. వలసలు, ఆర్ధిక వ్యవస్థ, జాతీయ గుర్తింపు మధ్య నలిగి పోతున్న అన్ని అభివృద్ధి చెందిన దేశాలకూ ఈ తీర్పు వర్తిస్తుంది. 2002లో యూరోపియన్ యూనియన్లో ఒప్పందం తర్వాత జనాభా 25 శాతం పెరిగింది. ఇందులో 28 శాతం విదేశీయులున్నారంటే వలసల ఒత్తిడి ఏమేరకు ఉన్నదో అర్థమౌతుంది. స్విట్జర్లాండ్ అనగానే వృద్ధుల దేశం. జనాభా ఇంకా పెరిగితే ప్రభుత్వం నుంచి తాము పొందే సౌకర్యాలపై వేటు పడుతుందనే భయంతో ఈ ఓటింగ్ ఈ మేరకు వచ్చిందనుకోవాలి. పట్టణ ప్రాంతాలు, ఫ్రెంచి కాంటన్లు 70 మంది ఈ ప్రతిపాదనను వ్యతిరేకిం చినవారిలో ఉన్నారు. కోటి జనాభా పరిమితితో యూరోపి యన్ యూనియన్ తో ఒప్పందాన్ని తెంచుకోవడమంటే ఆత్మహత్యసదృశ్యమే అవుతుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

