The people are the rulers : చిన్నప్పుడు చదువుకొనే దశలో స్కూళ్లలోనూ, కళాశాలల్లో నూ, ఎదుగుతున్నప్పుడు సభలూ, సమావేశాల్లోనూ, వందేమాతరం మొదట్లో జనగణమన తర్వాత జాతీ య గీతాలుగా వినపడూ, మనసులో వున్న దేశ భక్తిని పెల్లుబుకించేది.
ఎప్పుడూ ఆ గీతాల్లో ఎన్ని పంక్తులు న్నాయని, ఎంత నిడివి వుందనీ ఎవ రికీ లెక్కించటానికి అప్పుడుసమయం జ్ఞాపకం రాలేదు. జాతీయ గీతం ఆల పించటానికి సందర్భమే గుర్తు చేస్తుండేది! దేశ భక్తికిజాతీయ గీతం అవసరం! అందులోని భావం మనస్సుల్లో నాటుకున్న తర్వాత సామాన్య మానవుడికి ఇతర విషయాలుపట్టించుకో దగ్గవిగా అనిపించేది కాదు! ‘వందేమాతరం’ అని వినిపించ గానే ఒళ్లు పులకరించేది. ‘జనగణమన’ వినిపించగానే గుండె ల్లో గణగణమని మంటలు మ్రోగేవి! మరియిప్పుడుజాతీయ గీతం మీద ఎందు కింత సంఘర్షణతో కూడిన రాద్దాంతం! ‘వందేమాతరం’ ఆలపిస్తున్న లతామంగేష్కర్, ఎ.ఆర్. రెహ మాన్, గొంతు కలు వాడవాడలా వినపడుతున్నప్పుడు నా దేశం భారత దేశం, నా జాతి లౌకికంగా పరిపూర్ణత సంత రించుకున్న భారత జాతి అని తనువెల్లా తన్మయత్వంతో నిండిపోయేది!
The people are the rulers
The people are the rulers : జాతీయ సభలలో పాడాలని ప్రతిపాదిం చింది
జాతీయ గీతాలు గురించి ఆ గీతంలో ఎన్ని వంక్తులు వుండాలన్న విషయంలో ప్రస్తుతం సుప్రీం కోర్టు లో లిటిగేషన్ తలెత్తాల్సిన అవసరం వుందా? ఏమో మరి జ్ఞాన సంపద లో వున్న మేధావులూ, దేశాన్ని ఏలుతున్న పాలకులూ ఆలోచించాల్సిన విషయం ఇది! ఇంగితజ్ఞానంతో వున్న సామాన్య మానవుడికి జాతీయ గీతంలో ఎన్ని పంక్తులు వుండాలి అన్నఆలోచన ఎన్నడూ రాలేదు. బంకించంద్ర చటర్జీ కలం నుంచి వెలువడిన ‘వందేమాతరం’ గుండెలను తడుముతుంటే ఉత్సాహంతో, దేశ భక్తితో సాధారణ వ్యక్తి జీవితాన్ని గడుపుతూ, నా దేశం అభివృద్ధి చెందాలి నా దేశం ఙ ండా ప్రతిచోటా ఎగరాలి నా వందేమాతరం గీతం ప్రతినోటా పలకాలి అన్న అద్భుతమైన ఆలోచనే వుండేది! ఆ గీతాలే స్వతంత్రం సాధించేంత వరకు మనమందరం ఒకటే అన్న భావన కల్పించాయి! మరి యిప్పుడేమయింది? 1937 సం॥లో, కాంగ్రేసు వర్కింగ్ కమిటీ బంకించంద్ర చటర్జీ వ్రాసిన ‘వందే మాతరం’ గీతం నుంచి మొదటి రెండు స్టాంజాలు జాతీయ సభలలో పాడాలని ప్రతిపాదిం చింది. ఎప్పుడైతే ‘జనగణమన’ జాతీయ గీతంగా జనవరి 24, 1950న ఆమోదించబడిందో, మొదటి ప్రసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ ‘వందేమాతరం’ను ‘నేషనల్ సాంగ్’గా రాజ్యాంగంలో అలాంటిది లేకపోయినా, సమంగా గౌరవించాలని అన్నారు. అప్పటి నుంచి ఆ గీతంలోని మొదటి రెండు స్టాంజాలు దేశంలో బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి!
జాతీయ గీతాలాపన ప్పుడు గౌరవ ప్రదంగా నిల్చోవాలి
వందేమాతరం గీతం 150వ యానివర్శరీ 2025లో జరిగింది. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం అన్ని స్టాంజాలు (అంటే ఆరు స్టాంజాలు) పాడాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకొని వచ్చింది. 2026 సం॥లో పార్లమెంట్లో ప్రివెంషన్ ఆఫ్ ఇన్సల్స్ టు నేషనల్ ఆనర్ (ఎమెండ్ మెంట్ యాక్ట్) ఆమోదించబడింది! ఎమ్. హెచ్. ఏ (మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్) మార్గదర్శకాలు సర్క్యులర్స్ రూపం లో విడుదల చేసిన తర్వాతనే పార్లమెంట్లో పైన పేర్కొన్న యాక్ట్ను ఆమోదించటం గమనార్హం! ఈ ఎమెండ్మెంట్ సెక్షన్ 3 (1971 యాక్ట్ నిది)కి ‘ఎక్స్టెన్షన్’గా చేయటం వల్ల ఎవరైతే జ ౦తీయ గీతాన్ని, (నేషనల్ యాంథం) నేష నల్ సాంగ్లను పాడటానికి అడ్డుపడ్డారో, శిక్షించే వెసులు బాటు కలిగించినట్లయింది. ఈ ఆర్డర్ సుప్రీంకోర్టులో ఛాలెంజి చేయటంతో కోర్టు ఏది ‘నేషనల్ సాంగ్’గా ప్రభుత్వం గుర్తిస్తుందో చెప్పాలి కానీ శిక్షించే అధికారం (బిజోయి ఎమాన్యుల్ (1986) సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వానికి లేదని చెప్పింది. ఈ తీర్పులో జాతీయ గీతాలాపన ప్పుడు గౌరవ ప్రదంగా నిల్చోవాలి అన్నది అధికారిక ఆదే శాలు చట్టంలో రూపొందించినట్లు వుంటేనే సాధ్యపడుతుం దని లేకపోతే, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లే నని అభిప్రాయపడింది! వందేమాతరం గీతాలాపన ఈ నేపథ్యం లో కొత్త సందేహాలతో పాటు కొత్త సమస్యలకు హేతువ యింది! ఈ సున్నిత విషయాలను ప్రభుత్వాలు కానీ, లిటి గెంట్లు కానీ కోర్టులదాకా తీసుకెళ్ళటంతో మనను మనమే అగౌరవ పర్చుకున్నట్లు అవుతుంది.
ఏపార్టీ అయినా ‘అహం’ను ప్రక్కన పెట్టి
నిజానికి జాతీయ గీతా లాపన, జనగణమన అయినా, వందేమాతరం అయినా జాతిని మేలుకొల్పటంతో పాటు ఉద్వేగాన్ని, దేశ భక్తినీ ప్రభోదించి, ఉత్సా హపరిచేందుకే! ఈ అనవసరపు చర్చ లూ, కొత్తగా తెచ్చిన ప్రభుత్వ నిబంధనలు అమలు పర్చా లని ప్రభుత్వాలు పట్టుపట్టడం వల్ల జాతి సమైక్యతా, సామరస్యాల మీద ప్రభావాన్ని చూపిస్తుంది! ప్రతిపక్షాలు కూడా కొన్ని సున్నితమైన, జాతీయ పరమైన విషయాలలో అనవసరపు పట్టు పట్టగూడదు. అవసరమనుకుంటే ఏపార్టీ అయినా ‘అహం’ను ప్రక్కన పెట్టి అందరూ కలిసి కూర్చొని, ఇబ్బందులను కనీసం ఇలాంటి విషయాల్లోనైనా పరిష్కరిం చుకోక తప్పదు! ప్రతి సమస్యకూ అది చిన్నదయినా పెద్ద దయినా పరిష్కారం సాధ్యపడుతుంది. మన దేశంలోని పౌరులందరినీ కుల, మత, వర్గవిభేదాలకు అతీతంగా ప్రభు త్వాలూ, ప్రతిపక్షాలూ దగ్గరికి తీసి, ఏకత్వాన్ని ప్రదర్శించిన ప్పుడే మన దేశ గొప్ప మార్గదర్శక సూత్రం ‘ఏకత్వంలో భిన్నత్వం’ బలోపేతం కావటమే కాకుండా జాతినమైక్యతకు అద్దం పడుతుంది! ధర్మాలు ఏవైనా పాటించే మనుషు లందరూ భారతీయులే! జాతీయతత్వంతో పాటు మానవతా వాదం అటు పాలకులూ, ప్రతిపక్షాలూ, ప్రజలు ఆదరించిన ప్పుడే దేశం అభివృద్ధి పథాన నడుస్తుంది! ఆర్థికంగా బల పడుతుంది. ప్రపంచ దేశాల మధ్య తలెత్తుకొని కీలక సమ యాలలో ఇతర దేశాలకు గూడా అనుసరణీయ మవుతుంది!
The people are the rulers
ఇవ్వాల్టిపాలకులు రేపటి ప్రతిపక్షాలుగా మారకుండా ..
మన ఇరుదు పొరుగు దేశాలు శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్లు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయో చూసినప్పుడు, మన దేశ నాయకులు విజ్ఞతా నైపుణ్యాన్ని పరిస్థితులకు ప్రభావాలకు లోనుగాకుండా ప్రదర్శించటం వల్లనే, ఇంతకాలం ప్రజాస్వామ్య పాలనా, మనుగడా సాధ్య పడింది! అన్ని దేశాల మాదిరే యుద్ధాలనూ, ఘర్షణలనూ, ఆర్థిక అసమానతలను ఎదుర్కొన్నా, భారతీయతను ఎల్లప్పుడూ కాపాడే నిజమైన విద్వేషరహిత మత సామరస్యాన్ని కాపాడుకుంటున్నాం! అన్ని మతాలకు ప్రతినిధిగానే భారత దేశం ఇప్పటికీ కొనియాడబడుతున్నది! నియంతలుగా పాలించటానికి ప్రయత్నించిన నాయకులను ప్రజలు నియం త్రించారు! తప్పు తెలుసుకొన్న సమర్థులైన నాయకులను తిరిగి ఎన్నికల ద్వారా అధికారంలోకి తీసుకొని రావటానికి వెనుకంజ వేయలేదు! ఆ చరిత్రతో అలరారుతూ అన్ని రం గాలలో గణనీయ ప్రగతిని సాధిస్తున్న భారత దేశం తప్ప టడుగులు వేయగూడదు! ఎన్నో సంవత్సరాల అభివృద్ధికి స్పీడ్ బ్రేకర్స్ను మనంతట మనమే కల్పించుకోగూడదు! నిన్నటి పాలకులు ఇవ్వాళ ప్రతిపక్షంగా మారారు! ప్రజాభి మానాన్ని కోల్పోవటం వల్లనే ఆ పరిస్థితి వారికి కలిగింది! అందుకే ఇవ్వాల్టిపాలకులు రేపటి ప్రతిపక్షాలుగా మారకుం డా వుండాలంటే ప్రజలందరి అభిమానం కుల, మత, వర్గాలకు అతీతంగా ఉండే పాలనను అందజేస్తేనే సాధ్యపడు తుంది! ప్రజాస్వామ్యం అవలంభించినప్పుడు రాజు ప్రజలే అన్నది మరిచిపోగూడదు! ప్రజా నాయకుడు రాజుగా మారటం ఈ దేశ వ్యవస్థలో సాధ్యపడదేమో! |
-రావులపాటి సీతారాంరావు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

