Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్

వార్త 3 weeks ago

Kalyandurgam Praja Darbar: ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి సమస్యలను నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు.

గురువారం కళ్యాణదుర్గం ప్రజావేదికలో నిర్వహించిన ప్రజాదర్బార్ (గ్రీవెన్స్) కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి పెద్దఎత్తున వినతిపత్రాలు స్వీకరించారు.

Kalyandurgam Praja Darbar: గత ప్రభుత్వంపై విమర్శలు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలు పేరుకుపోయాయని, వాటి పరిష్కారంపై తగిన శ్రద్ధ చూపక పోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తాయని విమర్శించారు. ప్రస్తుతం ప్రజల సమస్యల పరిష్కారానికే కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఆర్డీఓ వసంత్‌బాబు, డీఎస్పీ రవిబాబు, వివిధ శాఖల అధికారులతో కలిసి ఒక్కో వినతిని పరిశీలించిన ఎమ్మెల్యే, సాధ్యమైన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Read Also : CMRF Cheques:23 మంది బాధితులకు..సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

 ‘Praja Darbar’ program held on a grand scale in Kalyandurg.

బాధ్యతాయుతమైన సేవల అవసరం, కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

రెవెన్యూ, సంక్షేమ పథకాలు, భూ సమస్యలు, పెన్షన్లు, తాగునీరు, విద్యుత్, మౌలిక వసతులు తదితర అంశాలకు సంబంధించిన వినతులు అందినట్లు తెలిపారు. ఆర్థికపరమైన అంశాలు లేదా వివాదాస్పద కేసులకు సంబంధించిన సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ప్రజలు ఇచ్చిన ప్రతి వినతిని నమోదు చేసి, నిర్ణీత గడువులో పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందే విధంగా పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వసంత్‌బాబు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బోయ లక్ష్మీదేవి రమేష్, డీఎస్పీ రవిబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

తల్లికి వందనం డబ్బులు జులై 22న ఖాతాల్లోకి రూ.13,000!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha