Dailyhunt
ప్రజలకు హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

ప్రజలకు హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

వార్త 2 weeks ago

Hanuman Jayanti 2026: శ్రీ హనుమత్ జయంతి పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

భక్తి, శక్తి, ధైర్యానికి ప్రతీకగా నిలిచే ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు.

Read Also:Banakacharla Project: తెలంగాణ నీటిహక్కులు హరించే బనకచర్ల

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందేశం

శ్రీ హనుమత్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. శ్రీ రాముడికి పరమ భక్తుడు, అపార బలం, జ్ఞానం, ధైర్యానికి ప్రతీక అయిన శ్రీ హనుమంతుడు జన్మించిన రోజుగా భావించే ఈరోజు పరమ పవిత్రమైనది. శ్రీ హనుమంతుడిని కొలవడం ద్వారా భయాలు తొలగుతాయని, ధైర్యం, ఆరోగ్యం కలుగుతాయని, కష్టాలు తగ్గుతాయని భక్తుల నమ్మకం. ఆ స్వామి మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ మరొక్క మారు శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు..

Hanuman Jayanti 2026: మంత్రి నారా లోకేశ్ ఆకాంక్ష

హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. శ్రీ హనుమంతుడు భక్తి, శక్తి, ధైర్యానికి ప్రతీక. హనుమాన్ జయంతి అంటే మనసుకు, శరీరానికి శక్తి, ధైర్యం, నిబద్ధతను ఇచ్చే పర్వదినం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే గుణానికి ఆంజనేయుడే నిదర్శనం. హనుమాన్ జయంతిని అందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, పవనపుత్రుడి ఆశీస్సులతో సుఖ, సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని లోకేశ్ ఆకాంక్షించారు..

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హనుమాన్ మందిర సందర్శన

శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం ఖైరతాబాద్ లోని హనుమాన్ మందిరంను రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా, తన సతీమణి జానకి శుక్లా తో కలిసి సందర్శించారు.అంజనేయస్వామి వారిని గవర్నర్ దంపతులు దర్శించుకుని పూజలు నిర్వహించారు.

అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు

మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను, అని జై శ్రీరామ్,జై హనుమాన్, అని పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఆస్తి పన్ను పెంపు ఉపసంహరించుకోవాలి.. బాబూరావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha