PM Modi Hyderabad Speech: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు త్యాగాలు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రధాని మాటలు ఆయన పరిపాలనా వైఫల్యాన్నే చాటిచెబుతున్నాయని రాహుల్ ఎద్దేవా చేశారు.
Read Also: PM Modi: మళ్లీ లాక్‌డౌన్ వస్తుందా? మోదీ వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఏంటి?
Rahul Gandhi’s strong reaction to Modi’s remarks in Hyderabad Speech.
PM Modi Hyderabad Speech: బాధ్యతను ప్రజలపైకి నెడుతున్నారు: రాహుల్ గాంధీ
సోమవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ, ప్రధాని వైఖరిని తప్పుబట్టారు. “నిన్న మోదీజీ ప్రజలను త్యాగాలు చేయమని అడిగారు. బంగారం కొనొద్దు, విదేశాలకు వెళ్లొద్దు, పెట్రోల్ వాడకం తగ్గించండి అన్నారు. ఇవి కేవలం ఉపన్యాసాలు కాదు.. 12 ఏళ్ల పాలనలో దేశాన్ని ఆయన దిగజార్చిన స్థితికి రుజువులు” అని పేర్కొన్నారు. ప్రతి సంక్షోభ సమయంలోనూ ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి, భారాన్ని ప్రజలపైకి నెట్టివేస్తోందని, ఒక ‘కాంప్రమైజ్డ్ ప్రధాని’ దేశాన్ని నడిపించడం ఇక సాధ్యం కాదని ఆయన ఘాటుగా విమర్శించారు.
ప్రధాని మోదీ విజ్ఞప్తి ఏంటి?
హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు కొన్ని కీలక విజ్ఞప్తులు చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడి పడుతోందని ఆయన వివరించారు. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రజలు కొన్ని నియమాలు పాటించాలని కోరారు. ఏడాది పాటు బంగారం కొనడం ఆపాలని, విదేశీ పర్యటనలను వాయిదా వేసుకోవాలని సూచించారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించి.. మెట్రో రైళ్లు లేదా కార్ పూలింగ్ విధానాన్ని అనుసరించాలన్నారు. ప్రయాణ ఖర్చులను తగ్గించేందుకు వీలైన చోట మళ్లీ ‘ఇంటి నుంచే పని’ విధానాన్ని పాటించాలని కోరారు. వంట నూనెలు, ఎరువుల వాడకాన్ని తగ్గించి విదేశీ మారకాన్ని ఆదా చేయాలని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ పిలుపు దేశ ఆర్థిక ప్రయోజనాల కోసమని బీజేపీ సమర్థిస్తుండగా, ఇది దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందనే దానికి సంకేతమని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

