Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రకాశ్ రాజ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: జనసేన నేత కిరణ్ రాయల్

ప్రకాశ్ రాజ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: జనసేన నేత కిరణ్ రాయల్

వార్త 3 weeks ago

Kiran Royal: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ లక్ష్యంగా జనసేన పార్టీ తిరుపతి ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రకాశ్ రాజ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YCP) అనుకూలంగా 'కోవర్ట్'గా పనిచేస్తున్నారని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను దెబ్బతీసేందుకు తెరవెనుక కుట్రలు పన్నుతున్నారని శనివారం తిరుపతిలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ ఆరోపణలకు బలాన్ని చేకూర్చేలా కొన్ని ఆడియో క్లిప్పింగులను కూడా ఆయన మీడియా ముందు బహిర్గతం చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మత విద్వేషాల ప్రయత్నం.. సోషల్ మీడియా వేదికగా టార్గెట్

రావణ్, శ్రవణ్ అనే వ్యక్తులతో చేతులు కలిపిన ప్రకాశ్ రాజ్.. ఆంధ్రప్రదేశ్‌లో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారని కిరణ్ రాయల్ ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని వాడుకుంటూ పవన్ కల్యాణ్, ఆయన కుటుంబసభ్యులపై ఉద్దేశపూర్వకంగా అపవాదులు వేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సాగుతున్న ఒక భారీ కుట్రలో ఈ నటుడు కీలక పాత్రధారి అని ఆయన పేర్కొంటూ, ప్రకాశ్ రాజ్‌పై తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Kiran Royal: విద్వేష ప్రసంగాలపై పోలీసుల తీరుపై ఆందోళన

గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'మావిగాన్' వంటి ఘటనలతో ప్రజల దృష్టిని మళ్లించడమే కాకుండా, అమరావతి రైతులపై దాడులు జరిగినప్పుడు ఒక నిర్దిష్ట వర్గాన్ని తప్పుబట్టేలా వ్యవహరించారని కిరణ్ రాయల్ విమర్శించారు. ఇదే క్రమంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో సమాజాన్ని కలుషితం చేసేలా పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు నమోదు చేస్తున్న కేసులు చాలా బలహీనంగా ఉంటున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. దీనివల్ల నిందితులు సులువుగా బెయిల్ పొంది బయటకు వస్తున్నారని, చట్టాలను మరింత కఠినతరం చేయాలని కోరారు. ఏపీలో అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష వైసీపీల మధ్య మాటల యుద్ధం ముదిరిన తరుణంలో ఈ ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Epaper: epaper.vaartha.com

కనీసం నా కొడుకు అస్థికలైన ఇవ్వండి - తల్లి విజయలక్ష్మి ఆవేదన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha