Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రకృతితో చెలగాటాలొద్దు!

ప్రకృతితో చెలగాటాలొద్దు!

వార్త 2 months ago

Environmental destruction : మానవ తప్పిదాల వల్లనే విపత్తులు ఒకదానివెంట ఒకటి తోసుకువస్తున్నాయి. అపారప్రాణనష్టం, ఆస్తి నష్టాలకు కారణాలవుతున్నాయి.

వాతావరణంలో తలెత్తుతున్న అనేక మార్పులు ప్రకృతి వైపరీత్యాలకుదారి తీస్తున్నాయి. రుతుపవనాల గమనాన్ని కూడా మార్చివేస్తు న్నాయి. అకాలవర్షాలతో జరుగుతున్న నష్టం అంతాఇంతా కాదు. ఇందుకు ముందుగా నిందించాల్సింది, తప్పు పట్టాల్సింది మానవుడినే. పర్యావరణ విధ్వంస చర్యలే ఈ బీభత్సాలకు, విపత్తులకు కారణాలవుతున్నా యని ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. పర్యావరణాన్ని కాపా డుకోకపోతే మానువుడి మనుగడే భవిష్యత్లో ప్రశ్నార్థ కంగా మారుతుందని, ఎందరో పర్యావరణ శాస్త్రవేత్తలు దశాబ్దాల తరబడి పదేపదే హెచ్చరిస్తున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. పర్యావరణాన్ని కాపాడడం అటుంచి తూట్లుపొడవడం దురదృష్టకరం.

Read Also : Southwest Monsoon: ఎండల వేడికి బ్రేక్: ఈనెల 26నే కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు!

 Environmental destruction

Environmental destruction : పొలాలను జనావాసాలుగా మార్చడం

ప్రైవేట్ వ్యక్తులే కాదు అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు చేపడుతున్న కొన్ని కార్యక్రమాలు పర్యావరణానికి చేటు తెస్తున్నాయి. ఇష్టాను సారంగా ఇసుక తవ్వకాలు మొదలు పెడితే కొండలను తొలచి ప్రాజెక్టులను, రహదారుల నిర్మాణం, నగరీకరణ పేరుతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఎకరాల పంట పొలాలను జనావాసాలుగా మార్చడం ఒకటేమిటి ఎన్ని విధా లుగా పర్యావరణానికి నష్టం చేయ గలుగుతారో అన్ని మార్గాల్లో నిత్యం అన్వేషణ, విధ్వంసం కొనసాగుతూనే ఉన్నది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం మరో దశాబ్ద కాలంలో భారత జనాభా 150కోట్లకు పైగా చేరుకుం టుందని అందుకు తగినట్లుగా దేశంలోని సహజవనరు లపై ఒత్తిడి పెరుగుతుందని ప్రధానంగా అటవీ సంపద హరించుకుపోతుందని స్పష్టంచేసింది. ఇప్పటికే భారత్ లో వేలాది ఎకరాల అడవీ భూములు మైదానాలుగా మారిపోయాయి.

ప్లాస్టిక్ వినియోగం

భారత్లో ప్రతిరోజూ దాదాపు మూడు వందల ఎకరాలకుపైగా అటవీ భూములు అదృశ్యమైపో తున్నాయని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. బొగ్గుగనులు, ధర్మల్ విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమలు, నదీలోయలో ప్రాజెక్టుల కోసం యధేచ్ఛగా అడవులను నరికివేస్తున్నారు. అడవులు తగ్గిపోయి ఆహారం దొరకక వన్యప్రాణులు ఎన్నో జనారణ్యంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇక ప్లాస్టిక్ కాగితాలు మట్టిలో కలిసిపోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతున్నాయి. కొన్ని ప్లాస్టిక్ వస్తువులను నిషేధించినా అవి కాగితాలకే పరిమితమై పోతున్నాయి. దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం అంత కంతకు పెరిగిపోతున్నది. ఈ ప్లాస్టిక్ పర్యావరణానికి ఎంత నష్టం చేకూరుస్తున్నదో ప్రజల్లో అవగాహన కల్పించ డంలో అధికారవర్గాలు విఫలమవుతున్నాయనేచెప్పొచ్చు. చట్టాలుచేసినా, నిబంధనలు విధించినా, ప్లాస్టిక్వా డకాన్ని ఏమాత్రం అడ్డుకోలేకపోతున్నారు. ఇక పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాల వాడకం గురించి చెప్పక్కర్లేదు. వాహన కాలుష్య నియంత్రణ మాటలకే పరిమితమవుతుంది. ఎన్ని చట్టాలు చేసినా, మరెందరిపై జరిమానా విధించినా, పెరుగుతున్న వాహనాల సంఖ్య రెట్టింపుస్థాయిలో కాలు ష్యాన్ని పెంచుతున్నది.

 Environmental destruction

నదులనే మురికి కూపాలుగా..

ఇక పరిశ్రమలు వదులుతున్న పొగ, ధూళికణాలు తదితరవన్నీ కలిసి వాయు కాలుష్యా న్ని పెంచుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలాంటి ప్రదేశాల్లో వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకున్న సందర్భా లెన్నో ఉన్నాయి. కాలుష్యాన్ని యంత్రించలేక ఏకంగా ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు సెలవులు ప్రక టించాల్సిన దురదృష్టపు పరిస్థితులు నెలకొంటున్నాయి. నీటికాలుష్యం పరిస్థితి అదుపు తప్పుతున్నది. పెరుగుతు న్న మురికివాడల నుంచి వెలువడుతున్న కలుషిత నీరు అంచలంచెలుగా నదుల్లోకి చేరుకొని పెద్దపెద్ద నదులనే మురికి కూపాలుగా మారుస్తున్నాయి. ఇలాంటి కారణాల తో భూమి ఉష్ణోగ్రత పెరిగిప్రపంచంలోని తీరప్రాంతాలు, దీవులతోసహా అనేక దేశాలు ముంపునకు గురయ్యే ప్రమా దం ఉందని ఏనాటినుంచో పర్యావరణ శాస్త్రవేత్తలు వాచ్చ రిస్తూనే ఉన్నారు. ఇక సముద్రాల్లో చేస్తున్న ప్రయోగాలు కూడా ప్రకృతిని దెబ్బతీస్తున్నాయి. ఇలా ప్రకృతితో మనిషి ఆటలాడుకుంటే అందుకు ప్రతీగా ప్రకృతి తీవ్రంగాస్పంది స్తున్నది.

అకాల వర్షాలు

పర్యావరణ సమతుల్యం దెబ్బతిన్న కారణంగా సకాలంలో వర్షాలు కురియడం లేదు. కురిస్తే అదే ప్రాం తంలో కుంభవృషకురవడం ఇటీవల పెరిగిపోతున్నది. అకాల వర్షాల గురించి చెప్పక్కర్లేదు. పిడుగులు, గాలివాన లతో అతలాకుతలం చేస్తున్నాయి. ఇవి పోనుఉపద్రవాలు విరుచుకుపడుతున్నాయి. యేటా దాదాపు మూడువందల ఎనభైకి పైగా ప్రపంచవ్యాప్తంగా ఉపద్రవాలు సంభవిస్తు న్నట్లు అధికార రికార్డులే వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యా ప్తంగా లక్షలాది మంది ఉపద్రవాలతో ప్రాణాలు పోగొట్టు కుంటుంటే కోట్ల సంఖ్యలో రోగపీడితులు అవుతున్నారు. పాకిస్థాన్, ఇరాన్, హైతి, న్యూజిలాండ్, నేపాల్ లాంటి ఎన్నోదేశాల్లో గత రెండు, మూడేళ్లుగా వచ్చిన భూకంపాలు విలయాన్నే సృష్టించాయని చెప్పొచ్చు. సిరియాలో ఆ మధ్య వచ్చిన భూకంపం కారణంగా దాదాపుతొమ్మిది వేల మంది అసువులు బాశారు. ఆ తర్వాత మొరోకోలో వచ్చిన ప్రకంపనాలు దాదాపు నాలుగువేల మంది జీవి తాలను సమాధి చేశాయి. పశ్చిమ ఆఫ్ఘానిస్థాన్లో వచ్చిన భూప్రకంపనాలు విలయమే సృష్టించాయని చెప్పొచ్చు. మనదేశానికి సంబంధించి కూడా అనేక పాంతాల్లో భూ ప్రకంపనాల వార్తలు వింటూనేఉన్నాం. చెన్నై, ముంబా యి, కోల్కతా, పూణె, ఢిల్లీ లాంటి దాదాపు డెబ్బైనగర్ లకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లు శాస్త్రజ్ఞులు హెచ్చరి స్తూనే ఉన్నారు. ఇక వరదలు, తుఫాన్లు, అకాల వర్షాలతో వ్యవ సాయరంగం కుదేలైపోతున్నది. ఏదిఏమైనా ఉపద్రవాల నియంత్రణకు పర్యావరణాన్ని కాపాడేందుకు త్రికరణశుద్ధిగా కృషి చేయాలి. ప్రధానంగా ప్రజల్లో అవగాహన పెంచాలి. ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మరెన్నో విలయాలు తప్పవు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గాలివాన బీభత్సం: 100 మందికి పైగా మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha