Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సైబర్ మోసానికి గురైన బాలీవుడ్ నటి కీర్తి కుల్హారి!

సైబర్ మోసానికి గురైన బాలీవుడ్ నటి కీర్తి కుల్హారి!

వార్త 3 weeks ago

Actress Kirti Kulhari: ప్రముఖ బాలీవుడ్ నటి, నిర్మాత కీర్తి కుల్హారి సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమె క్రెడిట్ కార్డును ఉపయోగించి అనధికారికంగా రూ.

2,43,852 మేర ఆర్థిక లావాదేవీలు జరపడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ మోసంపై ఆమె వెంటనే ముంబై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో అంబోలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, సిటీ సైబర్ సెల్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Read Also : Srinivasa Mangapuram Movie: 'శ్రీనివాస మంగాపురం' మూవీ రివ్యూ!

 Bollywood actress Kirti Kulhari falls victim to cyber fraud!

Actress Kirti Kulhari: విదేశీ ఎయిర్‌లైన్స్‌ పేరుతో డ్రా.. నిమిషాల్లోనే నాలుగు ట్రాన్సాక్షన్స్!

పోలీసుల కథనం ప్రకారం జూలై 24 రాత్రి ఈ ఘటన జరిగింది. అంధేరి వెస్ట్‌లోని ఓ మల్టీప్లెక్స్ వద్ద ఉన్న సమయంలో కీర్తి మొబైల్ ఫోన్‌కు బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది. ఆమె క్రెడిట్ కార్డు ద్వారా ‘ఏరోమెక్సికో ఎయిర్‌లైన్స్’ (Aeroméxico) లో 2,525 యూఎస్ డాలర్ల లావాదేవీ జరిగినట్లు అందులో ఉండటంతో ఆమె అప్రమత్తమై వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్‌ను సంప్రదించారు.

బ్యాంకు అధికారులు ఆమె ఖాతాను నిశితంగా పరిశీలించగా, కేవలం నిమిషాల వ్యవధిలోనే వరుసగా మొత్తం నాలుగు అనధికారిక లావాదేవీలు జరిగినట్లు తేలింది. వీటి మొత్తం విలువ రూ. 2.43 లక్షలకు పైగా ఉండటంతో, మరింత నష్టం జరగకుండా అధికారులు తక్షణమే ఆ క్రెడిట్ కార్డును బ్లాక్ చేశారు.

సమాచారం పంచుకోలేదు.. ఫోన్ హ్యాక్ అయిందా?

తాను ఎవరికీ క్రెడిట్ కార్డు పిన్, పాస్‌వర్డ్ లేదా ఓటీపీ (OTP) వంటి రహస్య వివరాలను పంచుకోలేదని కీర్తి కుల్హారి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టం చేశారు. దీంతో మాల్వేర్, స్పైవేర్ లేదా ఫిషింగ్ లింక్స్ ద్వారా ఆమె ఫోన్, కార్డు వివరాలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘పింక్’, ‘యూరి: ది సర్జికల్ స్ట్రైక్’, ‘మిషన్ మంగళ్’ వంటి హిట్ సినిమాలతో పాటు ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!’, ‘స్కూప్’ వంటి ప్రముఖ వెబ్ సిరీస్‌ల ద్వారా కీర్తి కుల్హారి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

'శ్రీనివాస మంగాపురం' మూవీ రివ్యూ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha