Nepal Flood Rescue Support : ఆగస్ట్ 26న నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం, హిమనీనదాలు (గ్లేసియర్స్) కూలిపోవడంతో భోటె కోషి నదిలో తీవ్ర వరదలు వచ్చాయి.
ఈ ఆకస్మిక వరదల వల్ల ఇళ్లు, వంతెనలు, రహదారులు, జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు 939 మంది మృతి చెందినట్లు నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ (NDRRMA) ధ్రువీకరించింది. దాదాపు 4,000 మందికి పైగా ఆచూకీ లభించకపోవడంతో మృతుల సంఖ్య మరిన్ని వేలకు పెరిగే అవకాశం ఉంది. పరిస్థితి తీవ్రమవ్వడంతో సహాయక చర్యలు, మృతదేహాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పలు దేశాల సాయాన్ని అర్థించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి లోక్ బహదూర్ ఛెత్రి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఫ్రీజర్లు, డీఎన్ఏ టెస్టింగ్ కిట్లు, LiDAR పరికరాల అభ్యర్థన. డిజాస్టర్ విక్టిమ్ ఐడెంటిఫికేషన్ (DVI) సహాయం, బ్రిడ్జ్ యూనిట్లు, డ్రోన్లు. టన్నెల్ రెస్క్యూ నిపుణులు, బ్రిడ్జ్ యూనిట్లు, డ్రోన్ల మద్దతు.
Read Also: Pakistan : పాకిస్థాన్లో మరో టెర్రరిస్టు హతం !
Nepal Flood Rescue Support
Nepal Flood Rescue Support : భారత్ సహా వివిధ దేశాల సహాయ చర్యలు
మృతదేహాలను సత్వరమే గుర్తించేందుకు భారత్ ఆగస్ట్ 29 నుంచి 18 మంది ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని నేపాల్‌కు పంపింది. వీరు డీఎన్ఏ విశ్లేషణ, బాధితుల వివరాలను నిర్ధారించే పనిలో నిమగ్నమయ్యారు. అమెరికా, చైనా, జపాన్, యూఏఈ, దక్షిణ కొరియా, బ్రిటన్, ఆస్ట్రేలియా, మలేషియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి దేశాలు టెంట్లు, దుప్పట్లు, ఫుడ్ ప్యాకెట్లు, మందులు, జనరేటర్లను అందిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి, డబ్ల్యూహెచ్‌ఓ, యూనిసెఫ్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఆపన్న హస్తం అందించాయి. టిబెట్‌లో చైనా నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్ ప్రాజెక్టుల వల్లే ఈ విపత్తు వచ్చిందన్న విమర్శలను చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ ఖండించారు. ఎత్తైన ప్రాంతాల్లో హిమనీనదాలు కూలిపోవడమే ఈ వరదలకు కారణమని నేపాల్, చైనా నిపుణుల ప్రాథమిక అంచనాల్లో తేలిందని ఆయన తెలిపారు. నేపాల్- టిబెట్ సరిహద్దుకు సమీపంలో కొండచరియలు విరిగిపడటం, గ్లేసియర్స్ కారణంగా ఆగస్ట్ 26న భారీ వరదలు సంభవించాయి. హిమాలయ ప్రాంతం నుంచి కిందికి ప్రవహించే బోటె కోషి నది వరద నీటిని మరింత దిగువ ప్రాంతాలకు తీసుకెళ్లింది. దీంతో పెను విపత్తు సంభవించింది. ఈ జలప్రళయంలో ఇప్పటివరకు 939 మంది మృతిచెందారని నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ (NDRRMA) ధ్రువీకరించింది.
Read Also hindi news: hindi.vaartha.com

